‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

#sankranthikivasthunam

వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది

‘గోదారి గట్టు’ సాంగ్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 100 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది.

దాదాపు 18 ఏళ్ల బ్రేక్‌ తర్వాత రమణ గోగుల పాడిన పాట ఇది. 

‘బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌’ అంటూ ఈ మూవీ కోసం వెంకటేశ్‌ పాట పాడటం విశేషం.

వెంకటేశ్‌ సరసన ఐశ్వర్యరాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.

అనిల్‌ తన గత చిత్రాలకు భిన్నంగా స్క్రిప్ట్‌ దశలోనే సన్నివేశాలను ఎడిట్‌ చేశారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ మొత్తం మూవీ షూట్‌ 72 రోజుల్లో పూర్తి చేశారు.

ఎఫ్‌2, ఎఫ్‌3 ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లు కాగా, ఇందులో క్రైమ్‌ ఎలిమెంట్‌ జోడించారు.

సినిమా మొత్తం నిడివి 2 గంటలా 26 నిమిషాలు వస్తే, 2 గంటలా 22 నిమిషాలతో సెన్సార్‌కు పంపారు.

సంక్రాంతి వేళ.. పోస్టర్ల కళకళ

‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి

ఓటీటీలో.. గ్రేటెస్ట్‌ కార్‌ మూవీస్‌

Eenadu.net Home