సాన్యా.. ది ‘స్పై’ బ్యూటీ..!

నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘స్పై’లో ఐశ్వర్య మేనన్‌తోపాటు మరో భామ కూడా నటిస్తోంది. తనే సాన్యా ఠాకూర్‌.

Image: Instagram/Sanya Thakur

సినీనేపథ్యం లేకున్నా.. తన ప్రతిభను నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ‘స్పై’తో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇందులో ఈమె స్పైగా కనిపించబోతోంది.

Image: Instagram/Sanya Thakur

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జన్మించిన సాన్యా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకుంది. స్టేజీ నాటకాల్లో శిక్షణ తీసుకుంది.

Image: Instagram/Sanya Thakur

ఓ వైపు చదువుకుంటూనే.. నాలుగేళ్లు స్టేజీ నాటకాల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అవకాశమొచ్చింది. 

Image: Instagram/Sanya Thakur

సినిమా హిట్‌ సాధించినా.. సాన్యాకు అవకాశాలు అంత ఈజీగా రాలేవు. ప్రతి రోజు ఆడిషన్స్‌కు వెళ్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

Image: Instagram/Sanya Thakur 

సినిమాలనే కాకుండా.. పలు బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ సాన్యా నటించింది. నెస్లే, ఫ్లిప్‌కార్ట్‌, టయోటా, లేస్‌ తదితర బ్రాండ్స్‌కు సంబంధించి 40కిపైగా యాడ్స్‌లో మెరిసింది. 

Image: Instagram/Sanya Thakur

ఓటీటీ కోసం ‘దిల్‌ బేకరార్‌’ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో తళుక్కుమంది. ‘డిస్కనెక్ట్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.అలాగే, పలువురు సింగర్స్‌తో మ్యూజిక్‌ వీడియోల్లోనూ ఆడిపాడుతోంది. 

Image: Instagram/Sanya Thakur

ఇప్పుడు ‘స్పై’లో ఓ కీలక పాత్రలో నటించింది. పాన్‌ఇండియా సినిమా కావడంతో.. తనకూ గుర్తింపు దక్కుతుందని భావిస్తోంది. 

Image: Instagram/Sanya Thakur

‘కలలు కనడం ఆపొద్దు. వాటిని నేను సాధిస్తున్నానంటే.. మీరూ సాధించగలరు. దానికి కావాల్సిందల్లా ధైర్యం ఒక్కటే’అంటూ తనలా ఎదగాలనుకునే యువతకు సాన్యా సలహా ఇస్తోంది.

Image: Instagram/Sanya Thakur

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home