నన్ను ఇంప్రెస్‌ చేయాలంటే ఫుడ్‌ ట్రక్‌ ఉండాలి!

‘హిట్‌ 2’లో పోలీసు పాత్రలో మెరిసిన కోమలి ప్రసాద్‌ ప్రస్తుతం ‘శశివదనే’తో అలరిస్తోంది. 

‘శశివదనే’చిత్రంలో హీరో రక్షిత్‌ అట్లూరి. ఈ సినిమాకి సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 19న విడుదలైంది.

This browser does not support the video element.

‘నేను సీతాదేవి’తో 2016లో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ‘శశివదనే’లో లంగావోణీల్లో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది.

అంతకుముందు ‘నెపోలియన్‌’, ‘అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి’, ‘ఏడ తానున్నాడో’, ‘రౌడీ బాయ్స్‌’, ‘సెబాస్టియన్‌ పీసీ 524’, ‘హిట్‌ 2’ తదితర చిత్రాలతో అలరించింది.

ఈమె విశాఖపట్నంలో పుట్టింది. కర్ణాటకలో డెంటల్‌ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. కానీ నటనపై ఉన్న ఆసక్తితో సినీపరిశ్రమ వైపు అడుగులు వేసింది. 

సినిమాలే కాదు.. ‘లూజర్‌’, ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ వంటి వెబ్‌సిరీసుల్లోనూ నటించి ఆకట్టుకుంది.

 ‘ఎవరి అండా లేకుండానే పరిశ్రమలోకి వచ్చాను. కానీ ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. నాకు స్టార్‌డమ్‌ అవసరం లేదు. ఓ నటిగా గుర్తిస్తే చాలు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

‘రౌడీ బాయ్స్‌’తో అనుపమ, కోమలి మంచి మిత్రులయ్యారు. ఇప్పటికీ ఆ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తూ పార్టీలు, పండుగల సమయంలో కలుస్తుంటారు.

‘ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తి యోగాకి మాత్రమే ఉంటుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు మనసును కూడా ప్రశాంతంగా మారుస్తుంది’ అంటుందీ తెలుగమ్మాయి. 

ఈమెకి పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఇన్‌స్టాలోనూ వాటి ఫొటోలు ఎక్కువగానే కనిపిస్తాయి. 

తనని ఇంప్రెస్‌ చేయాలంటే ఓ ఫుడ్‌ ట్రక్‌ ఉండాలంట. ‘నేనొక ఫుడీని నచ్చిన ఆహారం కనిపిస్తే అస్సలు కంట్రోల్‌ చేసుకోలేను’ అని చెబుతోందీ బ్యూటీ.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home