లక్కీ గర్ల్‌.. శనయా కపూర్‌

స్టార్‌ హీరో.. అదీ పాన్‌ఇండియా సినిమాలో కొత్త హీరోయిన్లకు అవకాశం రావడం కష్టమే. కానీ, బీటౌన్‌ బ్యూటీ శనయా కపూర్‌ ఆ ఛాన్స్‌ కొట్టేసింది. 

Image: Instagram/Shanaya Kapoor

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నంద కిషోర్‌ తెరకెక్కిస్తోన్న ‘వృషభ’లో శనయా ఓ కీలక పాత్ర పోషించనుంది. 

Image: Instagram/Shanaya Kapoor

ఇంతకీ ఈమె ఎవరంటే.. బాలీవుడ్‌ నటులు సంజయ్‌ కపూర్‌, మహీప్‌ కపూర్‌ గారాలపట్టి. జాన్వీకపూర్‌కి కజిన్‌.

Image: Instagram/Shanaya Kapoor

శనయాను నిర్మాత కరణ్ జోహార్‌ ‘బెధాదక్‌’తో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఇంకా ఆ చిత్రం విడుదల కాకముందే ఈ సుందరికి ‘వృషభ’లో అవకాశమొచ్చింది.

Image: Instagram/Shanaya Kapoor

హీరోయిన్‌గా సినిమా చేయడానికి ముందే.. జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. 

Image: Instagram/Shanaya Kapoor

తన తల్లి మహీప్‌ కపూర్‌ నటించిన ‘ఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ సిరీస్‌లో అతిథి పాత్రలో నటించి ఆకట్టుకుంది.  

Image: Instagram/Shanaya Kapoor

నటనలో శిక్షణ కోసం ఈమె.. ఏ స్కూల్‌కి వెళ్లలేదట. తెర వెనుక పనిచేస్తూ నటుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుందని ఓ సందర్భంలో ఈమె తండ్రి సంజయ్‌ కపూర్‌ తెలిపారు. 

Image: Instagram/Shanaya Kapoor

అనన్య పాండే, సుహానా ఖాన్‌, నవ్యా నంద ఈ బ్యూటీకి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. తరచూ పార్టీలకు వెళ్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. 

Image: Instagram/Shanaya Kapoor

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే శనయాకు.. బెల్లీ డ్యాన్స్‌లో ప్రావీణ్యముంది. తన బెల్లీ డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌మీడియాలోనూ పోస్ట్‌ చేసింది. '

Video: Instagram/Shanaya Kapoor

ఈ బీటౌన్‌ గ్లామర్‌ బ్యూటీకి హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, హీరోల్లో రణ్‌బీర్‌ కపూర్‌ అంటే చాలా ఇష్టమట.

Image: Instagram/Shanaya Kapoor

సినీ నేపథ్యం ఉండటంతో నెపొటిజం అంటూ ఈమెపై చాలా విమర్శలొచ్చాయి. వాటన్నింటిని తన ప్రతిభతో ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది శనయా.

Image: Instagram/Shanaya Kapoor

తెరంగేట్రానికి ముందే సోషల్‌మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఈమెను 1.7 మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Image: Instagram/Shanaya Kapoor 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home