బుల్లి తెర ‘భూమి’... ఇప్పుడు సినిమాల్లో...

చైతన్యరావు ‘షరతులు వర్తిస్తాయి’తో టాలీవుడ్‌ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది నటి.. భూమి శెట్టి. చిత్రంలో విజయశాంతి అనే సగటు భార్య పాత్రలో నటించి మెప్పించింది. 

ఈ భామ వెండితెరకు కొత్తే గానీ.. తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు.. ఎందుకంటే ఇదివరకు ‘నిన్నే పెళ్లాడతా’, ‘అక్కాచెల్లెలు’ టీవీ సీరియల్స్‌తో సుపరిచితమే. 

కర్ణాటకలోని కుందపురలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ‘కిన్నరి’ అనే కన్నడ టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. బుల్లితెరపై తనకంటూ పాపులారిటీ సంపాదించుకుంది.

తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో సీరియల్స్‌ను మధ్యలోనే వదిలేసి బిగ్‌బాస్‌లో పాల్గొంది. 

ఆ తర్వాత బుల్లితెరపై కాకుండా వెండితెరపై దృష్టి పెట్టింది. హీరోయిన్‌ అవ్వాలన్న కోరికతో సీరియల్స్‌లో నటించకుండా.. సినిమా అవకాశం కోసం ప్రయత్నించింది. 

అలా మొదటిసారిగా 2021లో కన్నడ ‘ఇక్కత్‌’తో హీరోయిన్‌గా మారింది. ఆ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. 

This browser does not support the video element.

భూమి నటన చూసి ‘షరతులు వర్తిస్తాయి’చిత్రబృందం.. తమ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసింది. ఈ విషయం చెప్పడానికి ఫోన్‌ చేస్తే ఫ్రాంక్‌ కాల్‌ అనుకుందట. 

‘వైవిధ్యమైన పాత్రల్లో నటించినప్పుడే నటుల ప్రతిభ బయటపడుతుంది. నాకు వచ్చే పాత్రలకు నూరు శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా’అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

ఈ కన్నడ బ్యూటీ త్వరలో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టనుంది. ‘ఒక నటి/నటుడు ఒక సినీపరిశ్రమలో తనను తాను నిరూపించుకున్నారంటే.. ఇతర ఇండస్ట్రీల్లోనూ రాణించగలరు’అని అంటోంది. 

భూమి.. నటి మాత్రమే కాదు, యక్షగాన, భరతనాట్య కళాకారిణి కూడా. చిన్నతనంలోనే వాటిని నేర్చుకుంది. బైక్‌ రైడింగ్‌, విహారయాత్రలకు వెళ్లడమన్నా చాలా ఇష్టం.

This browser does not support the video element.

సోషల్‌మీడియాలో చీరకట్టుతోపాటు.. గ్లామర్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈమె డ్రెస్సింగ్‌పై విమర్శలూ వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే.. జీవితంలో ఎదగలేం అంటోంది భూమి.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home