వాహ్‌.. శార్వరి వాఘ్‌

 ‘ప్యార్ కా పంచనామా 2’తో బాలీవుడ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన శార్వరి వాఘ్‌.. తాజాగా జాన్‌ అబ్రహంతో కలిసి ‘వేద’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

‘బంటీ ఔర్‌ బబ్లీ’తో మొదటి సారిగా వెండితెరపై మెరిసిందీ భామ. అలియా భట్ గూఢచారిగా వస్తోన్న చిత్రంలోనూ ఈమె కీలకపాత్రలో కనిపించనుంది. 

సిద్ధార్థ్‌ మల్హోత్ర దర్శకత్వం వహించిన ‘మహారాజా’ చిత్రంలోనూ ఈ బ్యూటీ నటించింది. ఇదీ ఈ ఏడాదే విడుదల కానుంది.

మరాఠీ కుటుంబానికి చెందిన ఈమె ముంబయి(1996)లో పుట్టింది. చదువంతా స్థానికంగానే సాగింది. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్ అండ్‌ క్లియర్‌ ఫేస్‌ వాష్‌ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్‌ గెలుచుకుంది.

ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించింది. అప్పుడే తనకి దర్శకత్వంపై ఆసక్తి కలిగిందట.

అలా 2015లో ‘ప్యార్ కా పంచ్‌నామా 2’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘సోను కే టిటు కి స్వీటీ’ తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసింది.

‘ద ఫర్‌గాటెన్‌ ఆర్మీ- ఆజాదీ కే లియే’ వెబ్‌సిరీస్‌తో నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి.

తన తొలి సినిమా‘బంటీ ఔర్‌ బబ్లీ 2’తోనే 2022లో ఐఫా, 67వ ఫిల్మ్‌ ఫేర్‌లో ఉత్తమ నటిగా అవార్డులను గెలుచుకుంది.

ఖాళీ సమయం దొరికితే పెంపుడు జంతువులతో ఆడుకుంటుందట. రణ్‌వీర్ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లకు వీరాభిమాని. నాయికల్లో అలియా భట్‌ అంటే ఇష్టం.

‘పుస్తకాలు చదవడం బాగా నచ్చుతుంది. చిరాకుగా ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా పుస్తకాలు చదివితే ప్రశాంతంగా ఉంటుంది’ అని చెబుతోందీ బ్యూటీ. 

This browser does not support the video element.

శార్వరి.. భోజన ప్రియురాలు. నచ్చిన ఫుడ్‌ అంతా లాగించేస్తుంది. ఆ తర్వాత జిమ్‌లోనూ అంతే శ్రద్ధగా కెలోరీలను కరిగించేందుకు కష్టపడుతుంటుంది.

కేన్స్‌లో హాలీవుడ్‌ సొగసులు

‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్‌

సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

Eenadu.net Home