‘కృష్ణ వ్రింద విహారి’.. అదిరింది సుందరి!

నాగశౌర్య హీరోగా విడుదలైన ‘కృష్ణ వ్రింద విహారి’తో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమైంది నటి షిర్లీ సేథియా.

Image: Instagram/shirleysetia

అంతకుముందు ఈ యంగ్‌ బ్యూటీ.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మస్కా(2020)’, నాని ‘ఎంసీఏ’ బాలీవుడ్‌ రీమేక్‌ ‘నికమ్మ’లో నటించింది.

Image: Instagram/shirleysetia

తొలి చిత్రంతోనే అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Image: Instagram/shirleysetia

షిర్లీ .. 1995 జూలై 2న డయ్యూ డామన్‌ రాజధాని డామన్‌లో పుట్టింది. పెరిగింది మాత్రం న్యూజిలాండ్‌లో. ఆమెకు భారత్‌, న్యూజిలాండ్‌ పౌరసత్వం ఉంది.

Image: Instagram/shirleysetia

ఆక్లాండ్‌ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసిన షిర్లీ.. చదువుకుంటూనే రేడియో జాకీగా పనిచేసేది.

Image: Instagram/shirleysetia

రేడియోలో సరదాగా పాడిన పాటలను ఆమె తన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో మంచి ఆదరణ లభించింది.

Image: Instagram/shirleysetia

షిర్లీ వాయిస్‌తోపాటు ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యింది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు మిలియన్ల వ్యూస్‌ వచ్చేవి.

Image: Instagram/shirleysetia

దీంతో సింగర్‌ అవ్వాలని షిర్లీ భావించింది. అలా బీటౌన్‌లో అడుగుపెట్టి పదిహేనుకుపైగా ఆల్బమ్స్‌లో పాటలు పాడింది. ఈ క్రమంలో ఆమెకు నటనలోనూ అవకాశాలు వచ్చాయి.

Image: Instagram/shirleysetia

అలా నెట్‌ఫ్లిక్స్‌ సినిమాతో యాక్టింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టి.. బాలీవుడ్‌లో తళుక్కుమని.. టాలీవుడ్‌లో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోంది.

Image: Instagram/shirleysetia

షిర్లీ మంచి ఫుడ్డీ.. పిజ్జా.. పావ్‌బాజీ అంటే చాలా ఇష్టమట.

Image: Instagram/shirleysetia

ఈ కుర్రహీరోయిన్‌కి ఇన్‌స్టాలో 7.4 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/shirleysetia

తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటింది. విక్టరీ వెంకటేశ్‌, రాజ్‌కుమార్‌ రావు, శిల్పాశెట్టి, అభిమన్యుని మొక్కలు నాటాలని నామినేట్‌ చేసింది.

Image: Instagram/shirleysetia

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home