శివమ్‌ దూబె.. ప్రేమలోనూ విజేతే!

అఫ్గానిస్థాన్‌తో జరిగిన 2 టీ20 మ్యాచ్‌ల్లో శివమ్‌ దూబె అటు బ్యాట్‌తో.. ఇటు బాల్‌తో అదరగొట్టాడు. మరోసారి తన ఆల్‌రౌండర్‌ ప్రతిభను చాటడంలో విజయవంతమయ్యాడు. గ్రౌండ్‌లోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ అతడు విజేతే.

తన ప్రేమను కుటుంబం వ్యతిరేకించినా.. సర్దిచెప్పి ప్రియురాలిని వివాహమాడాడు. వీరి పెళ్లి అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే శివమ్‌ హిందువు కాగా.. అతడి భార్య ఒక ముస్లిం. పేరు అంజుమ్‌.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంజుమ్‌.. అలీగఢ్‌ యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. 

పలు బాలీవుడ్‌ సీరియల్స్‌, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓ సందర్భంలో శివమ్‌తో పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. చాలా కాలం డేటింగ్‌లో ఉన్నారు. 

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పగా.. ఇరు కుటుంబాలు మొదట వ్యతిరేకించాయట. ఆ తర్వాత సర్దిచెప్పి ఒప్పించారు. 

ఎట్టకేలకు 2021లో కుటుంబసభ్యుల సమ్మతితో హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. అప్పుడే వీరి ప్రేమపెళ్లి విషయం అందరికీ తెలిసింది. 

సోషల్‌మీడియాలో తాము వివాహం చేసుకున్నట్లు ప్రకటించగానే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు విమర్శిస్తే.. మరికొందరు మద్దతు పలికారు.

ఎవరు ఏం అనుకున్నా.. వారిద్దరు మాత్రం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. గతేడాది ఈ జంట ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. 

This browser does not support the video element.

అంజుమ్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన భర్త, కుమారుడితో దిగిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. 

Images & video:instagram/anjum khan

ఎకానమీలో ఫెర్గూసన్‌ ది బెస్ట్‌.. ఆ తర్వాత వీరే!

క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్‌..

సూపర్‌ 8కి ఏ టీమ్‌ ఎలా వచ్చిందంటే?

Eenadu.net Home