శివంగి పిల్లా.. చిందేసే మళ్లా!

తాజాగా విడుదలైన విజయ్‌ ఆంథోని ‘బిచ్చగాడు 2’ మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇందులో హీరో, హీరోయిన్‌తోపాటు మరో బ్యూటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తనే శివంగి వర్మ.

Image: Instagram/Shivangi Verma

చిత్రంలోని ‘డుముకు చల్‌’ అంటూ సాగే ప్రత్యేక పాటలో తన అందం, నృత్యంతో ఆకర్షించింది. 

Image: Instagram/Shivangi Verma

దిల్లీలో పుట్టి పెరిగిన శివంగికి చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండేదట. నటనతో పాటు నృత్యంలోనూ శిక్షణ తీసుకుంది. 

Image: Instagram/Shivangi Verma

డ్యాన్సర్‌గానూ మారడంతో 2013లో ‘నాచ్‌ బలియే సీజన్‌ 6’లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది.

Image: Instagram/Shivangi Verma

‘హమారీ సిస్టర్‌ దిదీ’ సీరియల్‌తో బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. 

Image: Instagram/Shivangi Verma

‘హర్‌ ముష్కిల్‌ క హల్ అక్బర్‌ బీర్బల్‌’, ‘రిపోర్టర్స్‌’, ‘బుటు’, ‘చోటీ సర్దార్ని’ తదితర సీరియల్స్‌లో నటించింది. 

Image: Instagram/Shivangi Verma

పలు మ్యూజిక్‌ వీడియోలు, బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ మెరిసింది శివంగి.

Image: Instagram/Shivangi Verma

శివంగి డ్యాన్స్‌లో గ్రేస్‌ చూసి ‘బిచ్చగాడు 2’లోని ప్రత్యేక పాటలో అవకాశమిచ్చింది చిత్రబృందం. 

Image: Instagram/Shivangi Verma

తమిళ, తెలుగు భాషల్లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు వ్యూస్‌ బాగా వస్తున్నాయి.

Image: Instagram/Shivangi Verma

తాజాగా శివంగి.. పాట షూటింగ్‌ సమయంలో తీసుకున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది.

Image: Instagram/Shivangi Verma

ఈ పాటలో తనతోపాటు డ్యాన్స్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్లను, చిత్రబృందాన్ని పరిచయం చేసింది.

Image: Instagram/Shivangi Verma

శివంగికి సొంతంగా రెండు మొబైల్‌ యాప్స్‌ ఉన్నాయి. వాటి ద్వారా తన వ్యక్తిగత, సినిమా సంగతులు తెలుసుకోవచ్చట.

Image: Instagram/Shivangi Verma

ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ సోషల్‌మీడియాలోనూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఇన్‌స్టాలో ఈమెకు 1.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/Shivangi Verma

This browser does not support the video element.

‘పుష్ప’లో రష్మిక చేసిన ‘సామీ సామీ’ పాటకు కూడా తనదైన స్టైల్‌లో స్టెప్పులేస్తూ రీల్‌ పోస్ట్‌ చేసింది.

Image: Instagram/Shivangi Verma

వాహ్‌.. శార్వరి వాఘ్‌

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఉగాది పోస్టర్లివే!

Eenadu.net Home