క్యూట్ విలన్.. ఈ కన్నడిగన్
శోభా శెట్టి అదేనండీ.. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో మోనితగా నటించిన భామ. గుర్తుందా? ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది.
(Photos: Instagram/Shobhashetty)
ఆ సీరియల్‌లో డాక్టర్ బాబును పెళ్లి చేసుకోవడం కోసం వంటలక్క దీపను ఎన్ని కష్టాలు పెట్టిందో బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలుసు.
ప్రతినాయికగా తనదైన శైలిలో నటించి మెప్పించింది. పాత్రను తిట్టుకున్నా.. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
చాలాకాలం పాటు సాగిన ఈ సీరియల్ ఈ మధ్యే ముగిసింది. అయినా.. మోనిత పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బెంగళూరు యూనివర్సిటీలో ఎం.ఎస్సీ చదువుకుంది.
నటనపై ఆసక్తితో ప్రయత్నాలు చేయగా.. టీవీ సీరియల్‌లో అవకాశాలొచ్చాయి. అలా కన్నడలో ‘కావేరి’, ‘అగ్నిసాక్షి’ తదితర సీరియల్స్‌లో నటించింది.
ఆ తర్వాత తెలుగులో ‘అష్టా చమ్మా’, ‘కార్తీకదీపం’ సీరియల్స్ చేసింది. ఈమె పోషించిన మోనిత పాత్రకు అనేక టీవీ అవార్డులు దక్కాయి.
తన అందం, అభినయంతో యూత్‌ను ఆకట్టుకుంటోన్న ఈ భామకు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం సోషల్‌మీడియాపై ఫోకస్ చేసింది. ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
తాజాగా ఈమె నలుపు, ఊదా రంగు చీరల్లో దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరలయ్యాయి.
మరోవైపు తన పేరుతోనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఇందులో షాపింగ్, లైఫ్‌స్టైల్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు చేరువగా ఉంటోంది.