ఇండియన్ సినిమా టు హాలీవుడ్..
ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’తో అలరించిన శోభితా ధూళిపాళ్ల ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ‘రోలర్ కోస్టర్’ అని చెప్పుకొచ్చింది.
ఇందులో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని, కచ్చితంగా ఈ సినిమా ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆ మధ్య విడుదలైన ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ది నైట్ మేనేజర్’ వంటి వెబ్‌సిరీస్‌లు ఆమెకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
భాష ఏదైనా ఇబ్బంది లేదు.. సవాలుతో కూడుకున్న పాత్రలు, విభిన్నమైన కథల్లో నటించడానికే ప్రాధాన్యమిస్తుందట.
‘కెరీర్ ప్రారంభంలో ప్రతిదీ ఒక యుద్ధం లాగానే అనిపిస్తుంది. తెరపై కనిపించేంత అందంగా లేవని ఆడిషన్స్‌కి వెళ్లిన మొదట్లోనే చెప్పేవారు. కానీ నా కల కోసమే శ్రమించాను’ అని చెబుతుందీ భామ.
‘రమన్ రాఘవ్ 2.0’తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శోభితా ‘గూఢచారి’, ‘గోస్ట్ స్టోరీస్’, ‘కురుప్’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్- 1&2’తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
This browser does not support the video element.
ఇటీవల రామ్ చరణ్‌తో కలిసి ఓ ప్రకటనలో పెళ్లి దుస్తుల్లో మెరిసింది శోభిత. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది.
మహేష్ బాబు, హృతిక్ రోషన్‌కు ఈమె వీరాభిమాని. వీరితో ఒక్కసారైనా తెరపై కనిపించాలనేది తన కల.
ప్రస్తుతం ఈ భామ.. బాలీవుడ్‌లో ‘సితార’లోనూ నటిస్తోంది. ఇది కూడా తొందరలోనే విడుదల కానుంది.
ఖాళీ సమయం దొరికితే.. ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, పెయింటింగ్, గార్డెనింగ్ వంటివి చేస్తుంటుందట. అవే తన హాబీలు.