రోజుకి 30 గంటలు కావాలి..ఎందుకంటే?

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా షూటర్‌ మను బాకర్‌ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమె ఆసక్తులు, ఆసక్తికర విషయాలు ఓసారి చూద్దామా?

పారిస్‌ ఒలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్‌తో కలసి మను బాకర్‌ కాంస్యం గెలుచుకుంది. 

మనుకి సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్‌, స్కెచింగ్‌ చేస్తుంటుంది. 

‘పజిల్స్‌ సాల్వ్‌ చేయడంలో వచ్చే కిక్కే వేరు’ అంటుంటుంది మను. గుర్రపు స్వారీ చేయడం ఆట కాదు.. ఫిట్‌నెస్‌ మార్గం అని చెబుతోంది.

This browser does not support the video element.

సాయంత్రం 4 నుంచి 5 వరకు ఫిజియో సెషన్‌, 5 - 6 పెయింటింగ్‌, 6 - 8.30 జిమ్‌, 9 గంటలకు డిన్నర్‌ చేస్తుంది. 10 గంటలకల్లా నిద్రపోతుంది. 

మను షూటింగ్‌ మాత్రమే కాదు.. బాక్సింగ్‌, టెన్నిస్‌, కబడ్డీలో కూడా శిక్షణ తీసుకుంది. 

భారతీయ మార్షల్‌ ఆర్ట్‌ తాంగ్‌-టలోనూ తర్ఫీదు పొంది జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంది. 

రోజూ ఉదయం యోగా, మెడిటేషన్‌ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటాం అని చెబుతోంది. 

టోర్నీల సమయంలో మను డైలీ రొటీన్‌ పక్కాగా ప్లాన్‌ చేస్తుంది. 6 గంటలకు నిద్ర లేచి 7 వరకు యోగా చేస్తుంది. 8 గంటలకు అల్పాహారం తీసుకొని.. 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాక్టీస్‌ చేస్తుంది.

 లేడీ శ్రీరామ్‌ కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన మను.. ఇప్పుడు పంజాబ్‌ యూనివర్శిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదవుతోంది. 

 టోర్నీలు లేనప్పుడు, గ్యాప్‌ దొరికినప్పుడు.. ఆలస్యంగా నిద్ర లేవడం ఆమెకు అలవాటు. ‘ఇక ఆ రోజు నా ఇష్టం’ అని అంటుంది.

This browser does not support the video element.

రోజుకి 24 కాదు 30 గంటలు ఉంటే బాగుండును అని దేవుణ్ని కోరుకుంది. 3 గంటలు ఎక్కువ నిద్రపోయి.. ఒక గంట బాగా తిని, 2 గంటలు ట్రైనింగ్‌కి ఇచ్చేస్తాను అంటోంది. 

ఉదయం పూట కాస్త సమయం ఉన్నా.. ఎండలోకి వచ్చేస్తుంది. ఎందుకు అని అడిగితే సూర్యుడు డి విటమిన్‌ ఫ్యాక్టరీ కదా అని బదులిస్తోంది.

This browser does not support the video element.

మెడల్స్‌ అంటే ఎంత ప్రాణమో ఆమె సోషల్‌ మీడియా చూస్తే తెలుస్తుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్‌ మీద పక్కనే పెట్టుకుంటుంది. 

మను బాకర్‌ భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటుంది. ఒత్తిడిని అదుపు చేసుకోవడానికి భగవద్గీత బాగా ఉపయోగపడుతుంది అని చెబుతోంది. 

This browser does not support the video element.

మంచు ప్రాంతాలకు వెళ్తే మనులోని చిన్న పిల్ల బయటకు వచ్చేస్తుంది. అక్కడ మంచులో ఆడుకుంటూ కాలాన్ని పట్టించుకోదు. 

విదేశాలకు వెళ్లి టోర్నీల్లో పాల్గొన్నప్పుడు... రాత్రి సమయాల్లో అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టడం మనుకు బాగా ఇష్టం.

భారత్‌లో టాప్‌-10 గూగుల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌!

గబ్బాలో గతసారి పంత్‌ గర్జన.. ఈ సారి ఎవరు?

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

Eenadu.net Home