శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

‘నిరీక్షణ’తో అలరించిన శ్రద్ధా దాస్‌ తాజాగా ‘పారిజాత పర్వం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఏప్రిల్‌ 19న విడుదలైన ఈ సినిమాలో చైతన్య కథానాయకుడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్‌ కంభంపాటి దర్శకుడు.

This browser does not support the video element.

శ్రద్ధా దాస్‌కు బెంగాలీ, కన్నడ, హిందీలో అవకాశాలు వస్తున్నాయి. ‘అర్థం’ అనే తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

టీవీ షోస్‌లోనూ జడ్జిగా గ్లామర్‌ ఒలకబోస్తుంటుంది శ్రద్ధా దాస్. ఆ వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి కూడా.

‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’తో 2008లో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ అదే గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. 

మాస్ కమ్యూనికేషన్స్‌లో జర్నలిజం పూర్తి చేసిన శ్రద్ధ యాక్టింగ్‌పై ఆసక్తితో మోడలింగ్‌ ద్వారా కెరీర్‌ను మొదలుపెట్టింది.

బెంగాలీ కుటుంబానికి చెందిన శ్రద్ధ... చదువుకునే సమయంలోనే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వర్క్‌ షాపులకు అటెండ్‌ అయ్యేది. అప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది.

సుష్మితా సేన్‌ని స్ఫూర్తిగా తీసుకొని యాక్టింగ్‌లో ముందుకు సాగింది. 

This browser does not support the video element.

మిస్తీ దొహీ, రొయ్యల కూర అంటే మహా ఇష్టం. విహార యాత్రలకు వెళితే నీళ్లలో ఆడుకోవడం, పాడిల్‌ బోర్డింగ్‌ చేయడం నచ్చుతుంది.

షారుఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌కు ఆమె వీరాభిమాని. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా సినిమాలను ఎక్కువగా చూస్తుందట.

This browser does not support the video element.

చీరకట్టులో ఫొటోషూట్లతో సోషల్‌ మీడియాను హీటెక్కిస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 29 లక్షలకు పైమాటే!

శ్రద్ధకి క్రికెట్ అంటే ఇష్టం. అందులోనూ కోల్‌కతా టీమ్‌కి అభిమాని. ఐపీఎల్‌ సమయంలో మైదానంలో సందడి చేస్తుంటుంది.

కేన్స్‌లో హాలీవుడ్‌ సొగసులు

‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్‌

సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

Eenadu.net Home