రికార్డుల ‘స్త్రీ’.. శ్రద్ధాకపూర్‌ ఎంతో క్రేజీ..

#eenadu

శ్రద్ధాకపూర్‌ తండ్రి శక్తికపూర్‌ నటుడు అయినా సినిమాల్లోకి రావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదట.

బోస్టన్‌లో సైకాలజీ చదువుతున్నప్పుడు ఫేస్‌బుక్‌లో ఫొటో చూసి, ‘తీన్‌పత్తి’లో చిత్ర బృందం సంప్రదించింది. 

చదువుకునేటప్పుడు పాకెట్‌ మనీ కోసం బోస్టన్‌లో కాఫీ షాప్‌లోనూ శ్రద్ధ పనిచేసిందట.

16ఏళ్ల వయసులోనే సల్మాన్‌ఖాన్‌ పక్కన నటించే ఛాన్స్‌ వచ్చింది. చదువు ముఖ్యమని తన తండ్రి ఆ అవకాశాన్ని తిరస్కరించారు.

స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందడమే కాదు, సర్టిఫికెట్‌ కూడా అందుకుంది శ్రద్ధ.

‘బాఘీ’ మూవీ కోసం కలయరీపట్టు విద్య కూడా నేర్చుకుంది.

చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకున్న శ్రద్ధ.. తాను నటించిన పలు సినిమాల్లో పాటలు పాడింది.

జంతు ప్రేమికురాలైన శ్రద్ధ.. కొన్నేళ్ల కిందటే నాన్‌వెజ్‌ వదిలేసి శాకాహారిగా మారింది

అందం మేకప్‌తోనే వస్తుందనుకోనని చెబుతుంది శ్రద్ధ.. ‘హైదర్‌’లో కశ్మీరీ అమ్మాయిగా మేకప్‌ లేకుండానే నటించింది. 

అలా.. ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్‌

ఇండియన్‌ సినిమా: రూ.1000+ కోట్లు వసూళ్ల చిత్రాలివే

ఇడ్లీ కోసమే మైసూర్‌ వెళ్లా!

Eenadu.net Home