ఈ లాయర్‌.. ప్రేక్షకులు మెచ్చిన యాక్టర్‌!

ఉత్తర భారత్‌లో పుట్టి.. దక్షణాది చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోన్న నటి శ్రద్ధా శ్రీనాథ్‌.

Image: Instagram/shraddhasrinath

నాని ‘జెర్సీ’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది.

Image: Instagram/shraddhasrinath

తాజాగా ఈమె.. విక్టరీ వెంకటేశ్‌ కొత్త చిత్రం ‘సైంధవ్‌’లో ‘మనోజ్ఞ’ పాత్రలో నటిస్తోంది. ఈమేరకు చిత్రబృందం ప్రకటన విడుదల చేసింది. 

Image: Instagram/shraddhasrinath

జమ్మూకశ్మీర్‌లో 1990 సెప్టెంబర్‌ 29న కన్నడ కుటుంబంలో జన్మించింది శ్రద్ధ. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో చాలా రాష్ట్రాల్లో పెరిగింది.

Image: Instagram/shraddhasrinath

సికింద్రాబాద్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన శ్రద్ధ.. బెంగళూరుకి వెళ్లి న్యాయశాస్త్రంలో డిగ్రీ అందుకుంది.

Image: Instagram/shraddhasrinath

ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ లీగల్‌ సెల్‌లో పనిచేస్తూనే.. నటనపై ఆసక్తితో అప్పుడప్పుడు నాటకాల్లో పాల్గొనేది. పలు బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. 

Image: Instagram/shraddhasrinath

తొలిసారి 2015లో ‘కోహినూర్‌’ అనే మలయాళీ చిత్రంలో రెండో హీరోయిన్‌గా కనిపించింది. మరుసటి ఏడాది ‘యూటర్న్‌’తో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది.  

Image: Instagram/shraddhasrinath

శ్రద్ధ నటన మెచ్చి దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వడంతో న్యాయ వృత్తిని పక్కన పెట్టి ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. 

Image: Instagram/shraddhasrinath

కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రద్ధ ‘జెర్సీ’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జోడీ’, ‘కృష్ణ అండ్‌ హీస్‌ లీలా’లో నటించింది.

Image: Instagram/shraddhasrinath

బాలీవుడ్‌లోనూ ‘మిలాన్‌ టాకీస్’లో నటించింది. ‘ది విలన్‌’ అనే కన్నడ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. 

Image: Instagram/shraddhasrinath

ఇప్పటి వరకు 20కిపైగా సినిమాల్లో నటించిన ఈ భామ.. ఇటీవల ‘విట్‌నెస్‌’ అనే ఓటీటీ సినిమాలోనూ నటించింది.

Image: Instagram/shraddhasrinath 

పాత్రకు ప్రాధాన్యముండే చిత్రాల్లోనే నటిస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శ్రద్ధ.

Image: Instagram/shraddhasrinath

ప్రస్తుతం శ్రద్ధ చేతిలో ‘సైంధవ్‌’ సహా మరో నాలుగు ప్రాజెక్టులున్నాయి.

Image: Instagram/shraddhasrinath

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home