స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని.. 

కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న అదితీ రావు హైదరి, సిద్ధార్థ్‌ సెప్టెంబరు 16న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఈ జంట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం!

అలా మొదలైంది..

‘మహా సముద్రం’ సెట్‌లోకి ఎంటర్‌ అవుతూ.. సిద్ధార్థ్‌ ‘హాయ్‌ బ్యూటీఫుల్‌ గర్ల్‌’ అన్నారు. ఎవరైనా చెప్తే పట్టించుకోకపోయేదాన్ని.. కానీ తను చెప్తుంటే నచ్చింది - అదితి 

నేతి ఇడ్లీ.. 

షూటింగ్‌లో రోజూ టీమ్‌ మొత్తానికి నేతి ఇడ్లీలు చేయించి తీసుకొచ్చేవారు సిద్ధార్థ్‌. ఆ విషయం నాకెంతో నచ్చింది - అదితి 

రూమర్స్‌..

2022లో సిద్ధార్థ్‌ పుట్టిన రోజుకి అదితి ఓ పోస్టు పెట్టింది. దీంతో వీరి రిలేషన్‌ గురించి రూమర్లు మొదలయ్యాయి. 

స్కూలుకి వెళ్దామా..

‘మీ నానమ్మ హైదరాబాద్‌లో స్థాపించిన స్కూల్‌ చూడటానికి వెళ్దామా..’ అని ఓ సారి అడిగారు. ఎందుకు? అనే క్యూరియాసిటీతోనే తీసుకెళ్లా - అదితి

మోకాళ్లపై కూర్చొని.. 

స్కూల్‌కి వెళ్లగానే ‘మోకాళ్లపై కూర్చొని.. మీ నానమ్మ ఆశీస్సులతో నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు ఓకేనా?’ అని సిద్ధార్థ్‌ ప్రపోజ్‌ చేశారు.

ఎంగేజ్‌మెంట్‌..

అదితీ కుటుంబ అనువంశిక ఆలయం తెలంగాణలోని వనపర్తిలో ఉంది. అక్కడే ఈ ఏడాది మార్చిలో.. వీరి నిశ్చితార్థం అయింది. 

పెళ్లి

 400 ఏళ్ల నాటి ఆ గుడిలోనే వివాహం జరగాలని అదితి కోరింది. దాంతో.. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home