సిరి చందనపు చెక్కలాంటి భామ..
సిరి హనుమంతు.. న్యూస్ యాంకర్‌గా కెరియర్ ప్రారంభించి.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
(Photos: Instagram/Siri Hanumanthu)
మరోవైపు ఇన్‌స్టాలో గ్లామర్ ఫొటోలు పోస్టు చేస్తూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
విశాఖపట్నంలో పుట్టి పెరిగిన సిరి.. పలు అందాల పోటీల్లో పాల్గొంది. ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్’ టైటిల్‌నూ గెలుచుకుంది.
మొదట్లో న్యూస్ ఛానళ్లలో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసింది. ఆ తర్వాత యూట్యూబ్ షార్ట్‌ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.
‘ఎవరే నువ్వు మోహిని’, ‘సావిత్రి గారి అబ్బాయి’, ‘అగ్నిసాక్షి’ తదితర తెలుగు సీరియల్స్‌లో నటించి ఆకట్టుకుంది.
‘బిగ్‌బాస్’లో పాల్గొనడంతో సిరికి మరింత పాపులారిటీ దక్కింది. బయటకొచ్చాక వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరిసింది.
‘ఇద్దరి లోకం ఒకటే’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘నరసింహాపురం’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన సిరి.. ప్రస్తుతం ‘బూట్‌కట్ బాలరాజు’ చిత్రంలో నటిస్తోంది.
‘హేయ్ సిరి’ పేరుతో ఈమెకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ‘లాక్‌డౌన్ లవ్’, ‘మేడమ్ సర్ మేడమ్ అంతే’, ‘రామ్ లీలా’ తదితర వెబ్‌సిరీస్‌లు ఈ ఛానల్‌లోనే విడుదల చేసింది.
ఇక సిరి, నటుడు శ్రీహాన్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఓ బాబును దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు.