న్యూయార్క్‌ని వెలిగించిన తార.. సితార..

స్టార్‌ హీరో మహేశ్‌బాబు కుమార్తె సితార సోషల్‌మీడియాలో ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. డ్యాన్స్‌ వీడియోలతో సందడి చేస్తుంటుంది. ఫాలోవర్స్‌ సంఖ్యనూ పెంచుకుంటోంది. 

Image: Instgram/sitara 

తాజాగా ఈ ప్రిన్సెస్‌ ఓ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ యాడ్‌ను అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ‘టైమ్‌ స్క్వేర్స్‌’ పై ప్రదర్శించారు. 

Image: Instgram/sitara

మహేశ్‌బాబు దీనిపై స్పందిస్తూ.. ‘టైమ్స్‌ స్క్వేర్‌నే వెలిగిస్తున్నావు..!! నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ఇలానే కొనసాగించు’’ అని ఆకాంక్షించారు.

Image: Instgram/sitara

సితార.. 2012లో హైదరాబాద్‌లో పుట్టింది. చిరెక్‌ ఇంటర్‌నేషనల్‌ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. చిన్నప్పట్నుంచే నటన, డ్యాన్స్‌ అంటే ఆసక్తి కనబరుస్తోంది. 

Image: Instgram/sitara

This browser does not support the video element.

వెస్టర్న్‌, క్లాసిక్‌ డ్యాన్స్ రీతుల్లో శిక్షణ తీసుకున్న ఈ స్టార్‌ కిడ్‌.. దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో పాటు యూట్యూబ్‌లో ఆద్య- సితార అనే ఛానల్‌ను నిర్వహిస్తోంది. 

Image: Instgram/sitara

ఈ ఛానల్‌కి 2.8లక్షల సబ్‌స్క్రయిబర్లున్నారు. ఇందులో ఎప్పటికప్పుడు ఆద్య-సితార డ్యాన్స్‌, క్రాఫ్ట్స్‌, ఛాలెంజ్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

Image: Instgram/sitara

తను ఎంతో ఇష్టంగా చేసే వీడియోలు, సోషల్‌మీడియాలో పాపులారిటీ వల్లే జ్యువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అవకాశం లభించింది. 

Image: Instgram/sitara

హాలీవుడ్‌ యానిమేషన్‌ చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’ కోసం డబ్బింగ్‌ చెప్పింది. తన తండ్రి మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ’ పాటలో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Image: Instgram/sitara

ఈ బుజ్జమ్మకి కొత్త ప్రదేశాలకు వెళ్లడం, వాటిని వీడియోలో బంధించడమంటే చాలా ఇష్టం. అక్కడి విశేషాలు, ఆహార నియమాలు వంటివి యూట్యూబ్‌లో షేర్‌ చేస్తుంటుంది.

Image: Instgram/sitara

చదువుతో పాటే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం, భవిష్యత్తులో నటిగా ఎదగడమే తన లక్ష్యమంటోంది.

Image: Instgram/sitara

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home