బాణసంచా బాద్‌షా.. మినీ జపాన్.. మన శివకాశి
బాణసంచా అనగానే గుర్తొచ్చే పేరు శివకాశి. దేశంలోనే పెద్ద సంఖ్యలో బాణసంచా పరిశ్రమలు ఉన్న పట్టణమది. దేశంలో 90 శాతం టపాసులు ఇక్కడే తయారవుతాయి.
తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం.. రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి 500 కి.మీ దూరంలో ఉంది.
శివకాశికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో హరికేసరి పరాక్రమ పాండియన్ ఈ పట్టణాన్ని నిర్మించారు.
తొలుత 1921లో అగ్గిపుల్లల తయారీతో మొదలైన ఇక్కడి కుటీర పరిశ్రమ క్రమంగా విస్తరిస్తూ బాణసంచా తయారీలో అగ్రగామిగా ఎదిగింది. ప్రస్తుతం 3,200పైగా కుటీర పరిశ్రమలున్నాయి.
దేశంలో అత్యధికంగా అగ్గిపుల్లలు తయారయ్యేది శివకాశిలోనే. దేశానికి అవసరమైన అగ్గిపుల్లల తయారీలో 70 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి.
అగ్గిపుల్లల పరిశ్రమలు విజయవంతమవ్వడంతో స్థానిక ప్రజలు బాణసంచా పరిశ్రమలవైపు మొగ్గు చూపారు. శివకాశి శివారులోని 15కుపైగా గ్రామాల్లో బాణసంచా పరిశ్రమలున్నాయి.
శివకాశిలో 630కిపైగా అనుమతి పొందిన బాణసంచా తయారీ పరిశ్రమలున్నాయి. వాటిలో 1.3 లక్షల మందికిపైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
బాణసంచా, ఎలక్ట్రానిక్ వస్తువులకు జపాన్ పెట్టింది పేరు. దేశంలో శివకాశి కూడా టపాసులకు ఫేమస్ కావడంతో దీనిని మినీ జపాన్‌గా పిలుస్తుంటారు. దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ పేరు పెట్టారు.
ఇక్కడి ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు బాణసంచా, అగ్గిపుల్లల తయారీ, ప్రింటింగ్. ఈ పట్టణంలో 520 ప్రింటింగ్ పరిశ్రమలున్నాయి.
డైరీల తయారీలోనూ శివకాశి తనదైన ముద్రవేసింది. దేశంలోని 30 శాతం డైరీలు ఇక్కడి నుంచే ప్రింట్ అవుతాయి.
ప్రసిద్ధ దేవాలయాలకు శివకాశి నిలయంగా ఉంది. కాశీవిశ్వనాథ స్వామి దేవాలయం, శ్రీమరియమ్మన్ కోవిల్, భద్రకాళియమ్మన్ దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి.
ఇక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే.. చెన్నై, మదురై నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. మధురై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శివకాశి 70 కి.మీ దూరంలో ఉంది.
Pics: pixabay, unsplash