సెంచరీల క్వీన్ స్మృతి... ఈ 10 విషయాలు తెలుసా?
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన మహిళా బ్యాటర్‌గా స్మృతి మందన (8) ఇటీవల రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
స్మృతి క్రికెటర్ అవ్వడానికి స్ఫూర్తి ఆమె తండ్రి శ్రీనివాస్, అన్న శరణ్. ఇద్దరూ జిల్లా స్థాయి టోర్నీలు ఆడారు. వారిని చూసే ఆమె క్రికెటర్ అయ్యారు.
9 ఏళ్ల వయసులోనే ఆమె అండర్ 15 జట్టులోకి వచ్చేసింది. 11 ఏళ్ల వయసులో అండర్ 19 జట్టులోకి చోటు సంపాదించింది.
క్రికెటర్‌ను కాకపోతే షెఫ్ అయ్యేదానిని అని ఆమె చెబుతూ ఉంటుంది. ఆ ఆసక్తితోనే ఐదేళ్ల క్రితం ఆమె సొంత ప్రాంతం సంగ్లిలో SM18 స్పోర్ట్స్ కేఫ్‌ను ప్రారంభించింది.
విమెన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక బిడ్ పొందిన క్రికెటర్ స్మృతినే. రాయల్ ఛాలెంజర్స్ రూ3.4 కోట్ల బిడ్‌తో ఆమెను జట్టులో భాగం చేసుకుంది.
శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అంటే స్మృతికి చాలా ఇష్టం. ఆయన బ్యాటింగ్ శైలి తనకు స్ఫూర్తిని అని చెప్పింది.
సచిన్ తెందూల్కర్ ఆట చూస్తూ పెరిగా అని చెప్పే స్మృతి.. ప్రముఖ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, సాకర్ స్టార్ అలెక్స్ మోర్గాన్.. ఆమెకు ఆదర్శం.
భేల్ పూరి, ఛాట్, సేవ్ పూరి అంటే ఇష్టపడుతుంది. ఇలాంటి తినాలంటే రోడ్ సైడ్ దుకాణాలే కరెక్ట్ అని సగటు అమ్మాయిలా చెప్పింది స్మృతి.
ప్రపంచంలోనే ధనవంతురాలైన మహిళా క్రికెటర్లలో స్మృతి మందన ఒకరు. ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.35 కోట్లు.
భారత మహిళా వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ స్మృతి. అండర్ 19లో 224 పరుగులు చేసింది.
మహిళా టీ20 క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ శతకం ఆమె పేరునే ఉంది. కివీస్‌పై 24 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసింది.