సోషల్‌మీడియా సెన్సేషన్‌.. అంజలి అరోరా

అంజలి అరోరా.. ఇటీవల ‘ముంబయి అచీవర్స్‌ 2023’ అవార్డుల వేడుకలో ‘సోషల్‌మీడియా సెన్సేషన్‌ ఆఫ్ ది ఇయర్‌’గా నిలిచింది.

Image: Instagram/Anjali Arora

కొన్నాళ్ల కిందట సోషల్‌మీడియాలో ‘కచ్చా బాదం’ పాట తెగ వైరలైంది గుర్తుందా? ఆ పాటకు స్టెప్పులు సృష్టించింది ఈమెనే.

Image: Instagram/Anjali Arora

దిల్లీలో స్థిరపడ్డ పంజాబీ కుటుంబానికి చెందిన అంజలి.. మొదట్లో టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ టిక్‌టాక్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Image: Instagram/Anjali Arora

భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించడంతో ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.

Image: Instagram/Anjali Arora

అంజలి చేసిన ‘కచ్చా బాదం’ వీడియోకి లక్షల వ్యూస్‌ రావడమే కాదు.. తను వేసిన స్టెప్పుల్ని అనుకరిస్తూ నెటిజన్లు బోలెడు వీడియోలు రూపొందించారు.

Image: Instagram/Anjali Arora

ఆ ఒక్క పాటతో అంజలి సోషల్‌మీడియాలో సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఈ భామకి 12.7 మిలియన్‌ ఫాలోవర్స్‌, యూట్యూబ్‌లో 4.21లక్షల సబ్‌స్క్రయిబర్లున్నారు. 

Image: Instagram/Anjali Arora

సోషల్‌మీడియా పాపులారిటీతో కంగనా రనౌత్‌ నిర్వహించిన ‘లాకప్‌’ రియాల్టీ షోలో అంజలి పాల్గొంది. ఇందులో ఈమె రెండో రన్నరప్‌గా నిలిచింది. 

Image: Instagram/Anjali Arora

‘లాకప్‌’షోలోనే తన తోటి కంటెస్టెంట్‌ మునావర్‌ ఫారుఖీతో కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించారు.

Image: Instagram/Anjali Arora

నిజ జీవితంలో మాత్రం అంజలి.. తన తోటి డిజిటల్‌ క్రియేటర్‌ ఆకాశ్ సన్సావాలాతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

Image: Instagram/Anjali Arora

ఓ వైపు డిజిటల్‌ కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటూనే నటిగా రాణించేందుకు అంజలి ప్రయత్నాలు చేస్తోంది. 

Image: Instagram/Anjali Arora

ఈ క్రమంలో పలు పంజాబీ, హిందీ మ్యూజిక్‌ వీడియోల్లో ఈ బ్యూటీ ఆడిపాడుతోంది. తాజాగా ‘ఫీవర్‌ 104’ పేరుతో రూపొందించిన ఓ మ్యూజిక్‌ వీడియోలో మెరిసింది.

Image: Instagram/Anjali Arora

సోషల్‌మీడియాలో తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలు పోస్టు చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Anjali Arora

లీల... ది ‘లవ్‌ గురూ’ వైఫ్‌

వాహ్‌.. శార్వరి వాఘ్‌

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home