ఏడేళ్ల ప్రేమ.. ఏడడుగులు వేసి..

బాలీవుడ్‌ కథానాయిక సోనాక్షి సిన్హా.. ప్రేమించిన జహీర్‌ ఇక్బాల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి పెళ్లే నెట్టింట హాట్‌ టాపిక్‌.

కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో ఆదివారం సోనాక్షి వివాహ వేడుక జరిగింది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  

‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజున మేమిద్దరం మొదటిసారిగా ఒకరి చెయ్యి ఒకరం పట్టుకున్నాం. అప్పుడే నిర్ణయించుకున్నాం జీవితాంతం ఆ చేతులు విడిపోకూడదని. ఇరు కుటుంబాల సమ్మతంతో మా వివాహం జరిగింది’’ అని పోస్టు రాసుకొచ్చింది సోనాక్షి.

సోనాక్షి తండ్రి శతృఘ్నకి కుమార్తె వివాహం ఇష్టం లేదని.. వారి సమ్మతం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సోనాక్షితోపాటు కుటుంబసభ్యులు ఆ వదంతులను ఖండించారు.

శతృఘ్న పూర్తి సమ్మతంతోనే సోనాక్షి వివాహం జరిగింది. వివాహ పత్రాలపై సంతకాలు పెడుతున్నప్పుడు తండ్రి పక్కనే ఉన్న ఫొటోలను సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు. దీంతో ఆ రూమర్స్‌కి చెక్‌ పడింది.

జహీర్‌ విషయానికొస్తే 2019లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ‘నోట్‌బుక్‌’, ‘డబుల్‌ ఎక్స్‌ఎల్’, ‘రస్లాన్’లో నటించాడు. 2022లో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేశాడు. 

This browser does not support the video element.

సోనాక్షి, హ్యూమా ఖురేషి కలసి నటించిన ‘డబుల్ ఎక్స్‌ఎల్‌’లో జహీర్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సోనాక్షి మనసు గెలుచుకున్నాడు.

కొద్దిమందికి మాత్రమే వీరి ప్రేమ గురించి తెలుసు. ప్రేమలో ఉన్నప్పుడే విహారయాత్రలకు వెళ్లేవారు. ఆ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసేవారు కూడా. 

This browser does not support the video element.

తాజాగా వీరి ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కడంతో బాలీవుడ్‌లో మరో సక్సెస్‌ఫుల్‌ ప్రేమజంటగా నిలిచారు. సోషల్‌ మీడియాలో వీరికి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. 

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home