బాలీవుడ్‌ డేరింగ్‌ బ్యూటీ.. సోనాక్షి సిన్హా!

బాలీవుడ్‌లో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది దబాంగ్‌ హీరోయిన్‌.. సోనాక్షి సిన్హా.

Image: Instagram/Sonakshi Sinha

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు శత్రుఘ్న సిన్హా వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ బొద్దు గుమ్మ.. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే.. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.

Image: Instagram/Sonakshi Sinha

తాజాగా తన సోదరుడు తెరకెక్కిస్తున్న ‘నిఖితా రాయ్‌ అండ్‌ ది బుక్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’లో తాను నటిస్తున్నట్లు ప్రకటించింది.

Image: Instagram/Sonakshi Sinha

1987 జూన్‌ 2న బిహార్‌లోని పట్నాలో జన్మించిన సోనాక్షి.. ముంబయిలోని ఓ మహిళా యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తి చేసింది.

Image: Instagram/Sonakshi Sinha

తండ్రిది సినిమా నేపథ్యమే కావడంతో పలు చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది.

Image: Instagram/Sonakshi Sinha

మొదట్లో చాలా లావుగా ఉన్న సోనాక్షి.. హీరోయిన్‌ అవ్వాలని నిర్ణయించుకొని సన్నబడింది.

Image: Instagram/Sonakshi Sinha

2010లో వచ్చిన ‘దబాంగ్‌’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో సల్మాన్ ఖాన్‌ సరసన మెరిసింది. ఈ చిత్రం బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Image: Instagram/Sonakshi Sinha

ఈ క్రమంలోనే సోనాక్షికి పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా సహా అనే అవార్డులు వరించాయి.

Image: Instagram/Sonakshi Sinha

ఆ తర్వాత సోనాక్షి ‘రౌడీ రాథోడ్‌’, ‘సన్నాఫ్‌ సర్దాద్‌’, ‘దబాంగ్‌ 2, 3’ ‘ఆర్‌ రాజ్‌కుమార్‌’, ‘ఫోర్స్‌ 2’ తదితర చిత్రాల్లో నటించింది.

Image: Instagram/Sonakshi Sinha

అఖీరా, నూర్‌ వంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది.

Image: Instagram/Sonakshi Sinha

కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘లింగా’లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జోడీగా సోనాక్షి నటించి మెప్పించింది.

Image: Instagram/Sonakshi Sinha

హీరోయిన్‌గానే కాదు.. ‘ఓ మై గాడ్‌’, ‘హిమ్మత్‌వాలా’, ‘టోటల్‌ ధమాల్‌’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో మెరిసింది.

Image: Instagram/Sonakshi Sinha

సోనాక్షిలో మంచి గాయని కూడా ఉంది. తొలిసారి ‘తెవార్‌’లో తన గాత్రం వినిపించింది. ఆ తర్వాత పలు సినిమాలు, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో పాడింది.

Image: Instagram/Sonakshi Sinha

సోనాక్షి.. జంతు ప్రేమికురాలు. ‘పెటా’తో కలిసి శునకాలు, పిల్లుల దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

Image: Instagram/Sonakshi Sinha

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ శరీరాకృతిని విమర్శిస్తూ నెట్టింట్లో కామెంట్లు వచ్చేవి. వాటికి దీటుగా సమాధానివ్వడమే కాదు.. బాడీ షేమింగ్‌ ఎక్కడ జరిగినా తీవ్రంగా ఖండిస్తుంటుంది.

Image: Instagram/Sonakshi Sinha

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home