సోనియా సింగ్‌.. ఎప్పుడూ ట్రెండింగ్‌!

సోనియా సింగ్‌.. యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌సిరీస్‌లతో బాగా పాపులారిటీ సంపాదించిన నటి. 

Image: Instagram/soniya singh

‘న్యూ ఏజ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’, ‘నాన్‌-తెలుగు గర్ల్‌ఫ్రెండ్,’, ‘ఓయ్‌ పద్మావతి’, ‘సాఫ్ట్‌వేర్‌ సావిత్రి’ ఇలా సోనియా నటించిన చాలా వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్స్‌ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి.

Image: Instagram/soniya singh

‘యమలీల’ సీరియల్‌తో బుల్లితెరపై మెరిసిన ఈ క్యూటీ.. ఇప్పుడు ‘విరూపాక్ష’తో వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. 

Image: Instagram/soniya singh

సాయిధరమ్‌తేజ్‌, సంయుక్త జంటగా నటించిన ఈ చిత్రంలో సోనియా ఓ కీలక పాత్ర పోషించింది.

Image: Instagram/soniya singh

తను నటించిన వెబ్‌సిరీస్‌ల్లో ఎక్కువగా పవన్‌ సిద్ధుకు జోడీగానే కనిపించింది. ఈ ఇద్దరి జంట తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

Image: Instagram/soniya singh

చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు టాక్‌. సిద్ధుపై తనకున్న ప్రేమని టీవీ, సోషల్‌మీడియా వేదికగా బయటపెడుతుంటుంది. 

Image: Instagram/soniya singh

సోనియా చాలా చలాకీ అమ్మాయి. ఈమె మాటలు ఎంతో సరదాగా ఉంటాయి. తను పాల్గొన్న టీవీ షోలు, ఇచ్చిన స్పీచ్‌లు నెట్టింట్ట ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. 

Image: Instagram/soniya singh

తాజాగా సాయిధరమ్‌తేజ్‌తో కలిసి చేసిన ‘విరూపాక్ష’ స్పెషల్‌ చిట్‌చాట్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Image: Instagram/soniya singh

ప్రస్తుతం ఈ భామ.. ‘విరూపాక్ష’ ప్రమోషన్స్‌తోపాటు వెబ్‌సిరీస్‌లు, సినిమా షూటింగ్స్‌తో బిజీబిగా ఉంది. 

Image: Instagram/soniya singh

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home