‘సారీ’ ఎందుకు చెప్పాలో తెలుసా?

ఏదైనా పొరపాటు చేస్తే.. దానితో ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించమని అడగుతాం. అలాంటి ‘సారీ’కి ఒక రోజుంది. అది ఈ రోజే (మే 26). మరి నేషనల్‌ సారీ డే గురించి ఈ విషయాలు తెలుసా? 

1998లో జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని తొలిసారి నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఈ రోజున పెద్ద ఈవెంట్‌ నిర్వహిస్తారు. పూల బొకేలు ఇచ్చిపుచ్చుకొని సారీ డేని పండుగలా చేస్తారు.

ఎదుటి వ్యక్తికి మన చర్యల వల్ల కలిగిన బాధ పెద్దదైనా, చిన్నదైనా ముందుగా క్షమించమని అడగాలి. దాని వల్ల బాధ తగ్గినా, తగ్గకపోయినా సారీ చెప్పడం మన బాధ్యత. 

గొడవ తర్వాత ఆ బాధ నుంచి బయటపడాలన్నా, అక్కడితోనే అది ఆగపోవాలన్నా, ఎదుటి వారిని శాంతపరచాలన్నా సారీ చెప్పడమే సరైన దారి.

చిన్న చిన్న గొడవలకు భార్యాభర్తలైనా, స్నేహితులైనా.. ఇలా బంధం ఏదైనా విడిపోకుండా ఉండాలంటే క్షమించమని అడగాలి.

కొంతమంది ‘నేనేంటి, నా స్థాయేంటి..? నేనెందుకు చెప్పాలి సారీ’ అని అనుకుంటూ ఉంటారు. పొరపాటు చేస్తే సారీ అడిగినప్పుడే ఆ వ్యక్తికి విలువ, గౌరవం ఇస్తారు అని వాళ్లు గుర్తించాలి.

 ఒకవేళ పిల్లలకు సారీ చెప్పడం తెలియకపోయినా, దాని విలువ అర్థం కాకపోయినా వివరించి చెప్పాలి. చిన్నప్పుడే చెప్పడం వల్ల పెద్దయ్యాక ఏదైనా పొరపాటు చేస్తే క్షమాపణలు అడుగుతారు.

ఆ వ్యక్తి ఎంత దగ్గరి వారైనా ఒక్కోసారి కోపంలో విచక్షణ లేకుండా పెద్ద పెద్ద మాటలు అనేస్తుంటారు. ఆ తర్వాత కుదురుకుని ‘ఆ సమయంలో శాంతంగా ఎందుకు లేను’ అని బాధపడే బదులు.. పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పాలి.

సారీ చెప్పడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. ఎదుటి వ్యక్తి మీద మనకు ఎంత అభిమానం ఉందో చూపించడం. అలా అని సారీ చెప్పడం అలవాటుగా చేసుకుని.. తప్పులు చేసేవారిని క్షమించడం సరికాదు.

స్వేచ్ఛలో టాప్‌ టెన్‌ దేశాలివీ!

ఫ్యాషన్‌.. ఫుడ్‌.. టూరిజం.. కేరాఫ్‌ అడ్రస్‌ ఇటలీ!

అయితే ఈ చట్టాలు మీకోసమే...

Eenadu.net Home