బుల్లితెర రాములమ్మ.. 

బుల్లితెరపై రాములమ్మగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.. యాంకర్‌ శ్రీముఖి. తన మాటలతో, టైమింగ్‌ పంచ్‌లతో అందరినీ ఆకట్టుకుంటోంది.

This browser does not support the video element.

సోషల్‌మీడియాలో ఈమె క్రేజ్‌ అంతాఇంత కాదు.. ఇన్‌స్టాలో తన ఫాలోవర్ల సంఖ్య 48 లక్షలకు పైమాటే. 

తరచూ ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. 

2012లో అల్లు అర్జున్‌ ‘జులాయి’తో వెండి తెరపై, ‘అదుర్స్‌’ టీవీ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. జులాయిలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా కనిపించింది.

పరిశ్రమలోకి రాకముందు తను పెద్దగా మాట్లేడేదే కాదట. ఎక్కువ మంది ఉన్న చోటికి అయితే కనీసం వెళ్లడానికి కూడా సిగ్గుపడేదట. 

సినిమాల్లో పాత్రలు చేయడం కన్నా.. టీవీలో కనిపించడమే తనకు నచ్చుతుంది. ‘ఎన్ని సినిమాలు చేసినా రాని ఆనందం యాంకరింగ్‌ చేస్తే వస్తోంద’ని చెబుతోంది.

శ్రీముఖి తల్లి బ్యూటీషియన్‌ కావడంతో మేకప్‌ చేయడానికి ఓ షూట్‌కి వెళ్లినప్పుడు అక్కడ శ్రీముఖి కెమెరాలో కనిపించిందట. అప్పుడు ఓ డైరెక్టర్‌ తనకి నటిగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పారట. 

తను సినిమాల్లో నటించడం తండ్రికి ఇష్టం లేదట. అయినా అతి కష్టం మీద తండ్రిని ఒప్పించి పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘బిగ్‌బాస్‌ 3’లోనూ పాల్గొని సందడి చేసింది.

This browser does not support the video element.

‘బిగ్‌బాస్‌’ సమయంలో కొందరితో మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగిస్తోంది. పార్టీలు పండుగల సమయంలో జబర్దస్త్ అవినాష్‌తో పాటు ఇంకొందరితో సందడి చేస్తోంది.  

కార్టింగ్‌ అంటే ఇష్టం. అదీ రాత్రి వేళల్లో రైడ్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంది... ఫ్రెండ్స్‌తో ఫన్నీగా చేసిన రీల్స్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తోంది. వాటికి లైకులు లక్షల్లో వస్తుంటాయి.

ఇంటి వంటలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. ‘నచ్చిన ఆహారం ఎదురుగా ఉంటే కంట్రోల్‌లో ఉండటం చాలా కష్టం’ అంటోందీ బ్యూటీ!

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home