శ్రియా రెడ్డి.. ఓజీకి రెడీ!

పవన్‌ కల్యాణ్‌-సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఓజీ’లో నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషించనుంది.

Image: Instagram/Sriya Reddy

తాజాగా శ్రియా రెడ్డికి వెల్‌కమ్‌ చెబుతూ ‘ఓజీ’ చిత్రబృందం సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టింది. 

Image: Instagram/Sriya Reddy

శ్రియా రెడ్డి అంటే ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ, ‘పొగరు’లో విశాల్‌ను పెళ్లిచేసుకోవాలని మొండిపట్టు పట్టే విలన్‌ ఈశ్వరి పాత్ర ఈమెకు బాగా పాపులారిటీ తెచ్చింది.

Image: Instagram/Sriya Reddy

శ్రియ.. హీరో విశాల్‌ అన్న విక్రమ్‌ కృష్ణ సతీమణి. ‘పొగరు’ సినిమా సమయంలో విక్రమ్‌, శ్రియ ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 

Image: Instagram/Sriya Reddy

ఈ భామ.. 1983 నవంబర్‌ 28న చెన్నైలో జన్మించింది. ఈమె తండ్రి ప్రముఖ క్రికెటర్‌ భరత్‌ రెడ్డి. 

Image: Instagram/Sriya Reddy

చదువుపూర్తి కాగానే ‘సదరన్‌ స్పైస్‌’ మ్యూజిక్‌ ఛానల్‌లో వీజేగా కెరీర్‌ను ప్రారంభించింది. 

Image: Instagram/Sriya Reddy

వీజేగా తమిళనాడులో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న శ్రియ.. 2002లో విక్రమ్‌ నటించిన ‘సమురాయ్‌’తో తెరంగేట్రం చేసింది.

Image: Instagram/Sriya Reddy

తెలుగులో ‘అప్పుడప్పుడు’చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Image: Instagram/Sriya Reddy

ఆ తర్వాత ‘అమ్మ చెప్పింది.’, తమిళ్‌లో చేసిన తిమురు(తెలుగులో పొగరు) చిత్రాలు శ్రియకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 

Image: Instagram/Sriya Reddy

నిర్మాతగానూ మారిన శ్రియ.. 2009లో ‘తోరనై(తెలుగులో పిస్తా)’, ‘వేది’ చిత్రాలు తెరకెక్కించింది. ఆ రెండు సినిమాల్లో తన మరిది విశాలే హీరో. 

Image: Instagram/Sriya Reddy

ఆ మధ్య శ్రియ.. ‘సుడల్‌: ది వర్టెక్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించింది. ఆ సిరీస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడమేకాదు.. తన నటనకు ప్రశంసలు దక్కాయి.

Image: Instagram/Sriya Reddy

ప్రస్తుతం ఈ చెన్నై భామ.. ప్రభాస్‌ ‘సలార్‌’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పవన్‌ ‘ఓజీ’లోనూ కనిపించనుంది. 

Image: Instagram/Sriya Reddy

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home