శ్రియారెడ్డి అలియాస్ రాధారమ మన్నార్
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’.ఈ మూవీలో రాధారమ మన్నార్‌గా నటించారు శ్రియారెడ్డి. సీరియస్ లుక్స్‌తో ఆమె నటన సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో శ్రియారెడ్డి గురించి ఆసక్తికర విశేషాలు.
భారత మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తే ఈ శ్రియారెడ్డి. 1982 నవంబర్ 28న చెన్నైలో జన్మించింది.
స్కూల్‌లో ఉన్నప్పుడే శ్రియారెడ్డికి మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. ఆమె తండ్రి వాటికి అంగీకరించలేదు.
This browser does not support the video element.
కాలేజీలో చదువుతూనే ఓ మ్యూజికల్ ఛానెల్‌లో యాంకర్‌గా వర్క్ చేశారు. ఈ జాబ్ కోసం ఆమె ఐదుసార్లు ఆడిషన్‌లో పాల్గొన్నారు.
వీజే శ్రియగా ఆమె ఫేమ్ సొంతం చేసుకోవడంతో సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంట్లోవాళ్లకు చెప్పకుండానే తన తొలి చిత్రానికి సంతకం చేశారు.
2002లో విడుదలైన ‘సమురాయ్’తో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సహాయనటి పాత్రను పోషించారు.
‘అప్పుడప్పుడు’ (2003) అనే తెలుగు చిత్రంతో శ్రియా రెడ్డి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ‘19 రివల్యూషన్స్’ అనే ఇంగ్లిష్ చిత్రంలోనూ ఆమె నటించారు.
విశాల్ హీరోగా నటించిన ‘పొగరు’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించింది.
‘పొగరు’ విజయం తర్వాత విశాల్ సోదరుడు నిర్మాత విక్రమ్ కృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. 2008 మార్చి 9న వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఒక పాప.
వివాహం చేసుకున్న తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె వెండితెరకు దూరంగా ఉన్నారు. భర్తతో కలిసి తమ నిర్మాణ సంస్థ పనులు చూసుకున్నారు.
‘సమ్‌టైమ్స్’ (2018)తో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రియారెడ్డి.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
This browser does not support the video element.
ఖాన్సార్ సామ్రాజ్య కర్త రాజ మన్నార్ (జగపతిబాబు) మొదటి భార్య కుమార్తెగా రాధారమ మన్నార్ పాత్రలో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
పవన్‌కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘ఓజీ’లో శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
This browser does not support the video element.
ఫిట్‌నెస్ విషయంలో శ్రియారెడ్డి ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.
రానా సతీమణి మిహిక, నటి హన్సిక, విష్ణు.. శ్రియారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్స్.