వీళ్లు చెక్కను కాల్చితే.. అద్భుత చిత్రాలవుతాయ్‌!

పెన్ను, కుంచెతో బొమ్మలు వేయడం రొటీన్‌. అదే.. సూర్యరశ్మితో చిత్రాలు గీయడం.. వెరైటీ. అందేంటీ అనుకుంటున్నారా? 

Image: Instagram/Michael Papadakis

అవునండీ.. సూర్యకాంతిని ఉపయోగించి అద్భుతమైన చిత్రాలు గీస్తున్నారు.. కొందరు సృజనాత్మక చిత్రకారులు.

Image: Instagram/Michael Papadakis

భూతద్దం.. సూర్యుడి వేడి సాయంతో చెక్కపై బొమ్మలు గీయడాన్ని ‘సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌’ అంటారు.

Image: Instagram/Michael Papadakis

దేనిపైనైనా భూతద్దం ఉంచి సూర్యరశ్మి పడేలా చేస్తే ఆ వేడికి అది కాలిపోతుందన్న విషయం తెలిసిందే. దాన్నే చిత్రకారులు ఆర్ట్‌గా మలుస్తున్నారు.

Image: Instagram/Michael Papadakis

మన దేశంలో తమిళనాడుకు చెందిన విఘ్నేష్‌ ‘సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌’ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రాలు గీసి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. 

Image: Instagram/Vignesh Sunlight Artist

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, విజయ్‌ ఇలా పలువురు సినీ, క్రీడాతారల చిత్రాలు, మహాత్మా గాంధీ చిత్రం గీసి ఔరా అనిపించారు. 

Image: Instagram/Vignesh Sunlight Artist

తను గీసిన చిత్రాలను ప్రదర్శించడంతో పాటు.. ఎవరైనా కోరితే వారి ముఖాన్ని, పేర్లను చెక్కపై అచ్చువేసి ఇస్తూ ఆదాయం పొందుతున్నారు.

Image: Instagram/Vignesh Sunlight Artist

This browser does not support the video element.

ఇదిగో.. ఇలా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని చిత్రం గీసి మిస్టర్‌ కూల్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు విఘ్నేష్.

Image: Instagram/Vignesh Sunlight Artist

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home