సుర్వీన్.. అన్నింట్లో మెరిసెన్!
విక్టరీ వెంకటేశ్.. రానా కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. మార్చి 10న విడుదల కానున్న ఈ వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ తార సుర్వీన్ చావ్లా కూడా నటించింది.
Image: Instagram/Surveen Chawla
గతంలో ఈమె మోహన్‌బాబు, శర్వానంద్ ‘రాజు.. మహారాజు(2009)’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు.
Image: Instagram/Surveen Chawla
సుర్వీన్.. 1984 ఆగస్టు 1న చండీగఢ్‌లో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి. దీంతో మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా మారింది.
Image: Instagram/Surveen Chawla
తొలిసారి ఆమె 2003లో ప్రారంభమైన ‘కహీ తో హోగా’ అనే టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించింది. 2007 వరకు టీవీ సీరియల్స్‌లోనే నటించింది.
Image: Instagram/Surveen Chawla
కన్నడలో విడుదలైన ‘పరమేశ పాన్‌వాలా(2008)’తో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన రెండో చిత్రమే ‘రాజు మహారాజు’.
Image: Instagram/Surveen Chawla
తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. అయితే.. పంజాబీ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోంది. మూడు తమిళ చిత్రాల్లోనూ మెరిసింది.
Image: Instagram/Surveen Chawla
పలు హిందీ సినిమాల్లో నటించిన ఈ భామ.. ‘హిమ్మత్‌వాలా’, ‘క్రియేచర్ 3డీ’, ‘వెల్‌కమ్ బ్యాక్’లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది. పలు వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలు పోషించింది.
Image: Instagram/Surveen Chawla
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పోర్చడ్’లో సుర్వీన్ ‘బిజిలీ’ పాత్రలో నటించింది.
Image: Instagram/Surveen Chawla
సినిమాల్లో నటించిన కొత్తలో తను కూడా ‘కాస్టింగ్ కౌచ్’కి గురయ్యానని, లావుగా ఉంటే అవకాశాలు రావంటూ కొందరు తనను బాడీ షేమింగ్ చేసారని గతంలో వెల్లడించింది.
Image: Instagram/Surveen Chawla
ఓటీటీ కాలంలోనూ ఈ భామ.. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘రంగోలీ’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
Image: Instagram/Surveen Chawla
బాలీవుడ్‌లో షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
Image: Instagram/Surveen Chawla
సుర్వీన్.. అక్షయ్ థక్కర్‌ను 2015లో వివాహం చేసుకుంది. రెండేళ్ల తర్వాత తనకు వివాహమైన సంగతి బయటపెట్టింది. వీరికి ఓ పాప ఉంది.
Image: Instagram/Surveen Chawla
ఈ చండీగఢ్ భామ ఫిట్‌నెస్ ఫ్రీక్. ఫిట్‌గా ఉండటానికి తెగ కసరత్తులు చేస్తూ ఉంటుంది.
Image: Instagram/Surveen Chawla
ఖాళీ సమయం దొరికితే.. మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంది.
Image: Instagram/Surveen Chawla