సూర్య.. దేవీషా కలల రాకుమారుడు

ఐపీఎల్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌ సూప్లా షాట్‌కి ఫేమస్‌. ఎలాంటి బౌలర్‌కైనా ఆ ట్రీట్‌మెంట్‌ ఇస్తుంటాడు. కానీ రియల్‌ లైఫ్‌ దేవీషా అతణ్ని క్లీన్‌ బౌల్డ్‌ చేసేసింది. ఐపీఎల్‌ లేటెస్ట్‌ సెంచరీ హీరో సూర్య లవ్‌ లైఫ్‌ గురించి మీకోసం…

సూర్య బీకామ్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు.. అంటే 2012లో ఫ్రెషర్‌గా జాయిన్‌ అయిన దేవీషాను చూసి ప్రేమలో పడ్డాడు.

ఓ స్నేహితుడి ద్వారా దేవీషాను పరిచయం చేసుకున్నాడు. ఇంకంతే కబుర్లు, షికార్లతో ప్రేమ పక్షులైపోయారు. అప్పుడప్పుడూ బైక్‌రైడింగ్‌లు, కాఫీ డేట్‌లు జరిగిపోయాయి.

This browser does not support the video element.

2015 వరకూ ఈ ప్రేమాయణం సాగింది.. దేవీషా డ్యాన్స్‌ కోచ్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అప్పుడే కోల్‌కతా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సూపర్‌ఫాస్ట్‌ ఇన్నింగ్స్‌తో ఫేమస్‌ అయ్యాడు.

మరుసటి ఏడాదే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎన్ని కష్టాలు వచ్చినా తోడుగా ఉంటాననే ప్రమాణాలు చేసుకున్నారు. చెప్పినట్టుగానే సూర్య ఆటలో ఓడినప్పడు, డౌన్‌లో ఉన్నప్పుడూ ధైర్యం చెప్పి, తోడుగా ఉంది దేవీషా.

‘నా జీవితంలో చేసిన ఒక్క మంచి పని ఏంటంటే దేవీషాని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే..’ అంటుంటాడు సూర్య. 

సూర్య పుట్టిన రోజు, వీరి పెళ్లిరోజున దేవీషా సర్‌ప్రైజ్‌ పార్టీలు ప్లాన్‌ చేస్తుంటుంది. ‘ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే బంధాల్ని మరింత పదిలం చేస్తాయం’టోంది.

దేవీషాకి పెంపుడు జంతువులంటే మహా ఇష్టం... దేవీషా, సూర్య తీపి అనుభూతుల ఫొటోలతో పాటు పెట్స్‌ పిక్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది.

దేవీషాకి విహారయాత్రలకు వెళ్లడం బాగా నచ్చుతుంది. సూర్య కూడా ఆట వల్ల పెరిగే ఒత్తిడిని తట్టుకోవాలంటే ట్రిప్సే ఛాయిస్‌ అంటున్నాడు. 

స్నేహితులు, కుటుంబ సభ్యులతో గెట్‌ టు గెదర్‌లు, పార్టీలు, పండుగల్లో సందడి చేస్తుంటారీ క్యూట్‌ కపుల్స్‌  

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

సిక్స్‌ల వర్షం... ఏ మైదానంలో ఎన్ని సిక్సర్లు బాదారంటే?

ఏ జట్టు, ఎన్ని బంతులు మిగిలి ఉండగా?

Eenadu.net Home