వయ్యారాల ‘శ్వాగ్‌’..

‘హుషారు’తో తెలుగులో అభిమానుల్ని సంపాదించుకుంది దక్షా నగర్కర్‌. తాజాగా శ్రీవిష్ణు సరసన ‘శ్వాగ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హసిత్‌ గోలి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా విడుదలై థియేటర్లలో ఆకట్టుకుంటోంది. ఇందులో నాయిక రీతూ వర్మ. మీరా జాస్మిన్‌, దక్ష ప్రత్యేక పాత్రల్లో అలరించారు.

దక్ష 2015లో ‘హోరా హోరీ’తో తెలుగు తెరపై కనిపించింది. అంతకంటే ముందు ‘ఏకే రావ్‌ పీకే రావ్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ‘హుషారు’తో వచ్చింది. ఇందులో గీత పాత్రలో ఆకట్టుకుంది.

ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’, ‘బంగార్రాజు’, ‘రావణాసుర’ వంటి చిత్రాలతో అలరించింది. ఇటీవల విడుదలైన ‘లవ్‌ మి ఇఫ్‌ యూ డేర్‌’లో ప్రత్యేక పాత్రలో కనిపించింది.

1995లో ముంబయిలో పుట్టింది దక్ష. తల్లి సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలో పని చేయడం వల్ల వివిధ ప్రాంతాల్లో పెరిగింది. కార్డియాలజిస్ట్‌ అవ్వాలని ఆమె చిన్నప్పటి కల అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా బీబీఏలో చేరింది. మొదటి సంవత్సరంలో ఉండగా.. సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో చదువుపై సరిగా దృష్టి సారించక పరీక్షలో ఫెయిల్‌ అయ్యింది.

మొదటి సినిమా పూర్తయ్యాక యాక్టింగ్‌ నుంచి కొంత గ్యాప్‌ తీసుకొని చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌, యాక్టింగ్‌పై పూర్తి శ్రద్ధ పెట్టానని చెబుతోంది.

సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ హడావుడి అంతా ఇంతా కాదు. ఇన్‌స్టాలో దక్ష పెట్టే ఫొటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఇన్‌స్టాలో ఈమె ఫాలోవర్లు పదిలక్షలకు పైమాటే.

‘ట్రిప్‌కి వెళ్లాల్సి వస్తే న్యూయార్క్‌కే నా మొదటి ఓటు. తింటే పిజ్జానే తినాలి.. చూస్తే న్యూయార్క్‌నే చూడాలి’ అంటోంది దక్ష.

ఫిట్‌నెస్‌పై ఎక్కవ శ్రద్ధ పెడుతుంది. యోగాసనాలతో పాటు కఠినమైన వ్యాయామాలు చేస్తుంది. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతానని చెబుతోంది.

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

సాహసాలు.. ఐస్‌క్రీమ్‌లు.. ఇవీ భాగ్యశ్రీ ఇష్టాలు

Eenadu.net Home