శ్వేతా బసు ప్రసాద్‌.. ఈ భామ గుర్తుందా?

‘కొత్త బంగారు లోకం’తో టాలీవుడ్‌కి పరిచయమైన నటి శ్వేతా బసు ప్రసాద్‌. ఆ సినిమాలో వరుణ్‌ సందేశ్‌కి జోడీగా.. టీనేజీ అమ్మాయి స్వప్న పాత్రలో నటించి ఆకట్టుకుంటుంది.

Image: Instagram/Shweta Basu Prasad

చాలాకాలంగా తెలుగుతెరకు దూరంగా ఉన్న ఈ భామ.. బాలీవుడ్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Image: Instagram/Shweta Basu Prasad

శ్వేతా బసు నటించిన ‘ఇండియా లాక్‌డౌన్‌’ డిసెంబర్‌ 2న ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఈ భామ వేశ్య పాత్రలో కనిపించింది. 

Image: Instagram/Shweta Basu Prasad

జార్ఖండ్ లోని జంషేడ్‌పూర్‌లో జన్మించిన శ్వేతా బసు.. ముంబయిలో పెరిగింది. మాస్‌మీడియా అండ్‌ జర్నలిజంలో డిగ్రీ చేసింది.

Image: Instagram/Shweta Basu Prasad

చిన్నతనంలోనే ‘మక్దే’ అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది. ఇందులో తను డబుల్‌ రోల్‌లో నటించి మెప్పించింది. ఆ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటిగా నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు కూడా అందుకుంది.

Image: Instagram/Shweta Basu Prasad

ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘ఇక్బాల్‌’తో హీరోయిన్‌గా పరిచయమై పలు సినిమాల్లో నటించింది. 2008లో ‘కొత్త బంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌. 

Image: Instagram/Shweta Basu Prasad

అలా తెలుగులో ‘రైడ్‌’, ‘కళవర్‌ కింగ్‌’, ‘కాస్కో’, ‘ప్రియుడు’ తదితర చిత్రాల్లో నటించింది. ‘జీనియస్‌’లో ప్రత్యేక గీతంలోనూ ఆడిపాడింది. 2011 తర్వాత శ్వేతా బసు.. తెలుగు సినిమాల్లో కనిపించలేదు. 

Image: Instagram/Shweta Basu Prasad

తెలుగులో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్‌గా కాకపోయినా.. సహాయక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. 

Image: Instagram/Shweta Basu Prasad

This browser does not support the video element.

‘బద్రినాథ్‌ కి దుల్హానియా’, ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’, ‘శుక్రను’, ‘సీరియస్‌ మ్యాన్‌’, ‘కామెడీ కపుల్‌’ తదితర చిత్రాల్లో నటించింది బసు. తమిళ్‌, బెంగాలీ చిత్రాల్లోనూ మెరిసింది. 

Image: Instagram/Shweta Basu Prasad

కెరీర్‌ మొదటి నుంచీ పలు సీరియల్స్‌, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తూ వస్తోంది. అలా ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘క్రిమినల్‌ జస్టిస్‌: అధుర సచ్‌’ వెబ్‌ సిరీస్‌లో న్యాయవాది పాత్ర పోషించింది. 

Image: Instagram/Shweta Basu Prasad

శ్వేతా బసు.. 2018లో దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను వివాహమాడింది. ఏడాది తిరగకుండానే వీరిద్దరూ విడిపోయారు.

Image: Instagram/Shweta Basu Prasad

ఈ భామ మంచి నటే కాదు.. పెయింటర్‌ కూడా. కరోనా సమయంలో తన పెయింట్స్‌ను వేలం వేసి.. వచ్చిన డబ్బును కరోనా సహాయార్థం వెచ్చించింది. 

Image: Instagram/Shweta Basu Prasad

ఈ వారం ఓటీటీలో వీటిదే సందడి

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

Eenadu.net Home