శ్వేతా తివారీ.. వయసు 42. నమ్మగలరా..?

హిందీ సీరియల్స్‌ చూసేవారికి శ్వేతా తివారీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బీటౌన్‌లో చాలా ఫేమస్‌ టీవీ నటి. 

Image: Instagram/Shweta Tiwari

రెండు దశాబ్దాలకుపైగా తన అందం.. అభినయంతో బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. పలు సినిమాల్లోనూ నటించింది.

Image: Instagram/Shweta Tiwari

ప్రస్తుతం శ్వేత వయసు 42. అయినా.. తరగని అందంతో కట్టిపడేస్తోంది. సోషల్‌మీడియాలో ఈమె గ్లామరస్‌ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Image: Instagram/Shweta Tiwari

తాజాగా ఈ బ్యూటీ.. ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి. లేటు వయసులో ఘాటు అందాలతో ఆకట్టుకుంటోంది.  

Image: Instagram/Shweta Tiwari

శ్వేత కుమార్తె పలక్‌ తివారీ కూడా తాజాగా సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్‌’తో తెరంగేట్రం చేసింది. కుమార్తె కన్నా అందంగా.. యవ్వనంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Image: Instagram/Shweta Tiwari

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో 1980 అక్టోబర్‌ 4న జన్మించిన శ్వేత.. 2000లో ‘ఆనే వాలా పాల్‌’తో టీవీ సీరియల్‌ నటిగా మారింది. ‘కసౌటీ జిందగీ కే’తో బాగా పాపులరైంది. 

Image: Instagram/Shweta Tiwari

ఇక.. 2004లో ‘మద్‌హోషి’తో వెండితెరపై మెరిసింది. హిందీతోపాటు నేపాలీ, భోజ్‌పురి, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది.

Image: Instagram/Shweta Tiwari

‘నాచ్‌ బాలియే’, ‘ఝలక్‌ దిఖ్‌లాజా’ తదితర డ్యాన్స్‌ రియాల్టీ షోల్లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. కొన్నింట్లో, హోస్ట్‌గా, న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. 

Image: Instagram/Shweta Tiwari

బాలీవుడ్‌ ఫేమస్‌ షో బిగ్‌బాస్‌లో పాల్గొని సీజన్‌ 4 విజేతగా నిలిచింది. ఖత్రోన్‌ కే ఖిలాడీలో 4వ స్థానంతో సరిపెట్టుకుంది.

Image: Instagram/Shweta Tiwari 

సహనటుడు రాజ్‌ చౌదరిని శ్వేత 1998లో వివాహం చేసుకుంది. వీరికి 2000లో పలక్‌ తివారీ జన్మించింది. 

Image: Instagram/Shweta Tiwari

కొన్నాళ్లకు రాజ్‌ నుంచి విడాకులు తీసుకున్న శ్వేత.. అభినవ్‌ కోహ్లీని వివాహమాడింది. కొన్నాళ్లకు వీరిద్దరూ విడిపోయారు. 

Image: Instagram/Shweta Tiwari

ప్రస్తుతం శ్వేత.. ‘మే హూ అపరాజిత’ సీరియల్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. 

Image: Instagram/Shweta Tiwari

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home