‘యానిమల్’ నా దగ్గరకొస్తే... నో చెప్పేదాన్ని
తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. అయితే ఆమె మాత్రం ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
మార్చి చివరి వారంలో ఉదయ్‌పుర్‌లో పెళ్లంటగా అని అడిగితే... ‘నా వ్యక్తిగత విషయాలు ఎప్పుడైనా చెప్పానా? ఇప్పుడూ చెప్పను’ అంటోంది.
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ పదేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవలే వారి రిలేషన్ గురించి వెల్లడించింది.
‘డంకీ’లో మను పాత్రతో ఆకట్టుకుంది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో మరో మూడు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉంది.
‘వో లడ్‌ఖీ హై ఖహానా?’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’, ‘ఖేల్ ఖేల్ మే’ షూటింగ్ దశలో ఉన్నాయి.
‘‘డంకీ’లో షారుఖ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ వచ్చినందుకు ఆనందపడ్డాను. ఆయనతో కలసి పని చేయడం అద్భుతం’’ అని చెప్పింది తాప్సి.
‘‘ఇతర నటులు నన్ను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వను. ‘యానిమల్’ లాంటి కథ నా దగ్గరకొస్తే నో చెప్తాను’ అని కామెంట్ చేసింది.
చిన్నతనంలో సినిమాల్లో నటించాలనే కోరికతో, అందంగా కనిపించాలనే ఆలోచనతో కెమికల్స్ ఉన్న హెయిర్ ప్యాక్‌లూ, ఫేస్ ప్యాక్‌లు చేయించుకునేదట. వాటి రియాక్షన్ కారణంగా ఇబ్బంది పడిందట.
‘‘నటించడం వరకే నా బాధ్యత అని ఎప్పుడూ అనుకోను. ప్రేక్షకుల అభిప్రాయం, స్పందనని గౌరవిస్తా. వాళ్లకు నచ్చేలా నటించడానికి ప్రయత్నిస్తా’’ ఇదీ తన పాలసీ.
వృత్తి జీవితంతో పాటు సామాజిక బాధ్యతనూ బ్యాలెన్స్ చేస్తుంది తాప్సీ. అనాథల కోసం తన వంతు బాధ్యతగా సేవ చేస్తుంది. ఖాళీ సమయాల్లో వారితో సమయాన్ని గడుపుతుంది.