సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న సీనియర్‌ హీరోయిన్‌!

‘కూలీ నం.1’తో హీరోయిన్‌గా మారి.. ఇటు దక్షిణాది చిత్రసీమల్లో.. అటు బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా కొనసాగింది టబు. ప్రస్తుతం సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సహాయక పాత్రలు చేస్తూ బిజీగా ఉంది.

Image: Instagram/Tabu

ఈ ఏడాది టబు నటించిన ‘భూల్‌ భూలయ్యా 2’, ‘దృశ్యం 2’ హిట్టయ్యాయి. దీంతో ఆ సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది.

Image: Instagram/Tabu

టబు అసలు పేరు తబస్సమ్‌ ఫాతిమా హష్మి. సినిమా కోసం పేరు మార్చుకుంది. 1971 నవంబర్‌ 4న హైదరాబాద్‌లో జన్మించిన టబు.. టీనేజీలోనే ముంబయికి మకాం మార్చి అక్కడే చదువు పూర్తి చేసింది. 

Image: Instagram/Tabu

ఈ పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ మేన కోడలు. ఈ నేపథ్యంతోనే ‘బజార్‌’, ‘హమ్‌ నవ్‌ జవాన్‌’ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. 

Image: Instagram/Tabu

ఆ తర్వాత టాలీవుడ్‌లో వెంకటేశ్‌ సరసన ‘కూలీ నం.1’లో హీరోయిన్‌గా నటించి.. తొలి సినిమాతోనే పాపులారిటీ సంపాదించింది. 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’, ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాలు టబును దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ను చేశాయి. 

Image: Instagram/Tabu

మరోవైపు బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ అక్కడ కూడా టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అలా వివిధ భాషల్లో మొత్తం 80కిపైగా సినిమాల్లో నటించింది టబు. 

Image: Instagram/Tabu

అప్పుడెప్పుడో 2008లో టాలీవుడ్‌లో విడుదలైన ‘ఇదీ సంగతి’, ‘పాండురంగడు’లో నటించిన టబు.. 12 ఏళ్ల తర్వాత ‘అల.. వైకుంఠపురములో’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. 

Image: Instagram/Tabu

తన కెరీర్‌లో మొత్తం 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 2 నేషనల్‌ అవార్డులు సహా అనేక పురస్కారాలు అందుకుంది. 2011లో కేంద్ర ప్రభుత్వం టబును ‘పద్మశ్రీ’తో సత్కరించింది. 

Image: Instagram/Tabu

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, టబు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ‘దృశ్యం’ సిరీస్‌లోనూ అజయ్‌ అడగడంతో టబు కీలక పాత్ర పోషించింది. 

Image: Instagram/Tabu

టబు శాకాహారి. తన తల్లి ఎంతో రుచికరమైన చికెన్‌ బిర్యానీ చేసినా.. తను మాత్రం తినడానికి ఇష్టపడదట. 

Image: Instagram/Tabu

సమాజసేవ చేయడంలో టబు ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ‘రిలీఫ్ ప్రాజెక్ట్స్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటుంది.

Image: Instagram/Tabu

టబు వయసు ఇప్పుడు 51 ఏళ్లు. ఇంకా తను వివాహం చేసుకోలేదు. తన దృష్టిలో పెళ్లి కాకుండా తల్లవడం తప్పు కాదు. కానీ పిల్లలను ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రుల నుంచి వేరు చేయకూడదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

Image: Instagram/Tabu

ప్రస్తుతం టబు.. ‘కుత్తే’, ‘ఖుఫియా’, ‘భోళా’ చిత్రాల్లో నటిస్తోంది. 

Image: Instagram/Tabu

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home