గ్రీన్‌ బ్యూటీ... తమన్నా!

‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌తో అలరించిన తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో ‘అరణ్మనై 4’తో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతోంది. 

ఏప్రిల్‌ 26న విడుదలవుతున్న ఈ సినిమాకు సుందర్‌.సి దర్శకుడు. ఇందులో రాశీ ఖన్నా మరో కథానాయిక.

‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సీక్వెల్‌ ‘ఓదెల 2’లో తమన్నా శివుని భక్తురాలు ‘శివశక్తి’ పాత్రలో అలరించనుంది. 

‘అరణ్మనై 4’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మిల్కీ బ్యూటీ ధరించిన చీర వార్తల్లో నిలిచింది. ఈ గ్రీన్‌ కలర్‌ చీర ధర సుమారు రూ.75 వేలు.

తమన్నా, విజయ్‌ వర్మ ఇప్పుడు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ షూటింగ్‌ తర్వాత వాళ్లిద్దరూ మొదటిసారి డేట్‌కి వెళ్లారట. ఆ రోజు మరపురానిది అని ఈ జోడీ చెబుతుంటుంది.

గ్రీన్‌ కలర్‌ అంటే ఇష్టపడే తమన్నా వార్డ్‌ రోబ్‌లో మొత్తం ఆ రంగు షేడ్స్‌ దుస్తులే కనిపిస్తాయట. 

 ‘స్త్రీ 2’, ‘అరణ్మనై 4’, ‘వేద’ షూటింగ్‌ దశలో ఉన్నాయి. అందులో తొలి రెండు సినిమాలు హారర్‌వే కావడం గమనార్హం. 

తమన్నా శివభక్తురాలు. వీలు కుదిరినప్పుడల్లా కుటుంబంతో కలసి తీర్థయాత్రలకు వెళ్తుంటుంది. వారణాసి వెళ్లి భోళాశంకరుడి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుందట. 

This browser does not support the video element.

పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. వాటితో కలసి రీల్స్‌చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంది.

హాట్‌ పోజులతో సోషల్‌ మీడియాని హీటెక్కిస్తూ ఉంటుంది. ఆ ఫొటోలు మీరు కూడా చూసే ఉంటారు.

This browser does not support the video element.

తమన్నా ప్రత్యేక పాత్రలో అలరించిన ‘జైలర్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అందులోని ‘నువ్‌ కావాలయ్యా..’ పాట ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉంది.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home