‘యుద్ధం’లో యువరాణి.. తనీషా సంతోషి!

బాలీవుడ్‌లో మరో దర్శకుడి కుమార్తె తెరంగేట్రం చేసింది. తన పేరు తనీషా సంతోషి.

Image: Instagram/Tanisha Santoshi

ఈమె.. ‘అందాజ్‌ అప్నా అప్నా’వంటి హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు, నిర్మాత రాజ్‌కుమార్‌ సంతోషి తనయ.

Image: Instagram/Tanisha Santoshi

తాజాగా రాజ్‌కుమార్‌ తెరకెక్కించిన ‘గాంధీ గాడ్సే - ఏక్‌ యుద్ధ్‌’తో ప్రేక్షకులకు తనీషా పరిచయమైంది.

Image: Instagram/Tanisha Santoshi

జనవరి 26న ఈ చిత్రం విడుదలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. తనీషా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Image: Instagram/Tanisha Santoshi

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌.. తనీషా ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసి పెరిగారు. ప్రస్తుతం జాన్వీ స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుండగా.. ఇప్పుడు తన స్నేహితురాలి బాటలోకే వచ్చి కథానాయికగా మారింది తనీషా.

Image: Instagram/Tanisha Santoshi

ముంబయిలో 1998 ఆగస్టు 1న జన్మించిన ఈ భామ.. యూనివర్సిటీ ఆఫ్‌ ది ఆర్ట్స్‌ లండన్‌లో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌లో బీఏ చేసింది.

Imageఇ: Instagram/Tanisha Santoshi

మొదట్లో తన తండ్రిలాగే సినిమాలకు దర్శకత్వం వహించాలని తనీషా భావించింది. కానీ, చరిత్రను తెలియజేసే ‘గాంధీ గాడ్సే..’లో తాను ఒక భాగం కావాలని నటిగా మారిందట.

Image: Instagram/Tanisha Santoshi

నటిస్తానని చెప్పినప్పుడు తండ్రి రాజ్‌కుమార్‌ వద్దని చెప్పారట. కానీ, ఆడిషన్‌ తీసుకొని నటన బాగుంటేనే అవకాశమివ్వమని చెప్పడంతో తనీషా పట్టుదల చూసి రాజ్‌కుమార్‌ అవకాశమిచ్చారు. 

Image: Instagram/Tanisha Santoshi

చాలా మంది సెలబ్రిటీల వారసులు.. స్టార్‌ హీరోల సినిమాతో తెరంగేట్రం చేయాలని భావిస్తారు. తనీషా మాత్రం ఈ సినిమాలో ఓ డీగ్లామరస్‌ పాత్రతో పరిచయం కావడం విశేషం.

Image: Instagram/Tanisha Santoshi

ఈ కొత్త హీరోయిన్‌కు శ్రీరామ్‌ రాఘవన్‌, సంజయ్‌ లీలా భన్సాలీ, రాజ్‌కుమార్‌ హిరాణీ వంటి గొప్ప దర్శకులతో పనిచేయాలని ఉందట.

Image: Instagram/Tanisha Santoshi

నటనలో తనకు ఆలియా భట్‌ స్ఫూర్తి అని తనీషా చెప్పింది. ఆమె సినిమాల ఎంపిక బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

Image: Instagram/Tanisha Santoshi

అదిరింది అమ్మీ.. షహానా గోస్వామి!

నేటితరం.. ‘కపూర్‌’ తారలు!

టాలీవుడ్‌ ‘డెవిల్‌’తో ఇరానీ భామ డ్యాన్స్‌!

Eenadu.net Home