అందానికి ‘లేబుల్’
‘లేబుల్’ వెబ్‌సిరీస్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది తాన్యా హోప్. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు చూద్దాం..
Image: Tanya Hope
కన్నడ భామ 2016లోనే ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’తో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.
Image: Tanya Hope
కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన తాన్య.. ఇంగ్లాండ్‌లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత పుణెలో మోడలింగ్‌లో శిక్షణ తీసుకుంది.
Image: Tanya Hope
మోడలింగ్‌తో ఆకట్టుకున్న తాన్య 2015 ఫెమినా మిస్ ఇండియాలో టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో అవకాశాలొచ్చాయి. తొలిచిత్రంలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Image: Tanya Hope
This browser does not support the video element.
‘నేను శైలజ’లో అతిథి పాత్రలో మెరిసిన తాన్య.. ఆ తర్వాత ‘పటేల్ సర్’, ‘పేపర్ బాయ్’, ‘డిస్కో రాజా’, ‘ఇది మా కథ’ చిత్రాల్లో కనిపించింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ‘కబ్జ’లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.
Image: Tanya Hope
‘తడమ్’తో కోలీవుడ్‌లో, ‘యజమాన’తో శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మూడు భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది.
Image: Tanya Hope
‘సవాళ్లు జీవితాన్ని మరింత ఆసక్తికరంగా, అర్థవంతంగా మారుస్తాయి’అన్న సూక్తిని బలంగా నమ్మే తాన్య.. ఎలాంటి సవాళ్లు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Image: Tanya Hope
ఏ సెలబ్రిటీతోనైనా వెకేషన్‌కు వెళ్లాల్సి వస్తే.. హృతిక్ రోషన్‌తో వెళ్తానని చెప్పింది. అతడితో వెకేషన్ చాలా అడ్వెంచరస్‌గా ఉంటుందని అంటోంది.
Image: Tanya Hope
This browser does not support the video element.
తాన్యకు సంగీతం, డాన్స్ అంటే చాలా ఇష్టమట. ఫిట్‌నెస్‌కోసం కసరత్తులతోపాటు డ్యాన్స్ కూడా చేస్తుంటుంది.
Image: Tanya Hope
‘ఫిట్‌గా ఉండాలంటే.. నిరంతరం వ్యాయామం చేస్తూనే ఉండాలి. ఏం చేయకుండా ఉండేకన్నా.. ఏదో ఒకటి చేయడం ఉత్తమం’ అని తన ఫాలోవర్స్‌కి సలహా ఇస్తోంది.
Image: Tanya Hope
బాలీవుడ్‌తోపాటు, పంజాబీ చిత్రాల్లోనూ నటించాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానంటోంది.
Image: Tanya Hope
‘లేబుల్’లో జర్నలిస్ట్ మహితగా నటించింది. జై హీరోగా రూపొందిన ఈ సిరీస్ ‘డిస్నీ+హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది.