సబలెంక.. టెన్నిస్‌ తారక!

అరినా సబలెంక.. టెన్నిస్‌ రంగంలో ఇప్పుడో సంచలనం. ఈ రెండో సీడ్‌ ప్లేయర్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగి.. రెండో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకుంది.

సబలెంక 1998 మే5న జన్మించింది. 2015లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది

గతేడాది (2023) ఆస్ట్రేలియన్‌ ఓపెన్ విజేతగా సబలెంక నిలిచింది.

5'11" అడుగుల ఎత్తు ఉండే ఈ బెలారస్‌ అథ్లెట్.. సోషల్ మీడియాలోనూ యాక్టివే. 

ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు

ప్రతి మ్యాచ్‌ అనంతరం అభిమానులతో సెల్ఫీ దిగడం ఆమెకు అలవాటు.

This browser does not support the video element.

టెన్నిస్‌ కోర్టులో ఆటతో అదరగొట్టే సబలెంక... డ్యాన్స్‌ కూడా ఇరగదీస్తుంది

ఆట కోసం దేశాలు తిరిగే ఆమె ఖాళీ సమయం దొరికితే టూర్‌లకు రెడీ అవుతుంది. ఇన్‌స్టాలో ఆ ఫొటోలే తెగ కనిపిస్తాయి. 

సబలెంక ఫ్యాషన్‌కు ఫ్యాన్స్‌ ఎక్కువే. ట్రెండీ దుస్తుల్లో ఆమె దిగిన ఫొటోలకు లైకులే లైకులు.

ఫిట్‌నెస్‌ కోసం సబలెంక చాలా శ్రమిస్తుంటుంది. ఆమె కసరత్తుల గురించి ఫాలోవర్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మెల్‌ బోర్న్‌ వీధుల్లో విహరిస్తూ.. 

ఈఫిల్‌ టవర్ వద్ద సబలెంక హొయలు

Images:Instagram/𝗔𝗥𝗬𝗡𝗔 𝗦𝗔𝗕𝗔𝗟𝗘𝗡𝗞𝗔

కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

Eenadu.net Home