మన వేలిముద్రల్లాగే.. పులిచర్మంపై చారలు

(జులై 29.. గ్లోబల్‌ టైగర్స్‌ డే)

పులుల్లో ముఖ్యంగా ఐదు రకాలున్నాయి. బెంగాల్‌ టైగర్స్‌, సౌత్‌ చైనా టైగర్స్‌, ది ఇండోచైనీస్‌ టైగర్స్‌, సుమత్రన్‌ టైగర్స్‌, అముర్‌/సైబీరియన్‌ టైగర్స్‌. ఒక్కో పెద్ద పులి సగటున 363 కిలోలు ఉంటుందట.

ఏ ఇద్దరి మనుషుల వేలిముద్రలు ఎలా ఒకేలా ఉండవో.. పులుల చర్మంపై ఉండే చారలు కూడా ఒకేలా ఉండవు. ఒక్కో పులికి ఒక్కోలా ఉంటాయి. పులుల లెక్కింపులో ఈ చారలు ముఖ్య భూమిక పోషిస్తాయి.

పులి చెవుల వెనుకభాగంలో తెల్లని మచ్చలు ఉంటాయి. తన పిల్లల్ని కాపాడుకునేందుకు వాటిని ఓ ఫ్లాష్‌లైట్‌లాగా ఉపయోగించుకుంటుంది. ఏదైనా అపాయం ఉంటే పులి చెవుల్ని ఊపుతుంది. తెల్ల మచ్చలు ఊగుతూ కనిపించడంతో పిల్ల పులులు దాక్కుంటాయి. 

పులులకు భారత్‌ పుట్టిల్లు వంటింది. ప్రపంచంలోని పులుల సంఖ్యలో సగానికిపైగా పులులు భారత్‌లోనే ఉన్నాయి. వాటి సంరక్షణకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో టైగర్‌ రిజర్వ్‌లు కూడా ఉన్నాయి. 

అడవుల్లోని పులులకు వేటాడితే కానీ, ఆహారం లభించదు. అయితే, పది వేటల్లో ఒక్కసారి మాత్రమే పులికి ఆహారం చిక్కుతుంది. ఒక జింక దొరికితే.. వారం పాటు పులికి ఫుడ్‌ కొరత ఉండదు.

పులి ఎంత భారీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాని పంజాకి ఉండే బలం అంతా ఇంతా కాదు.. తన పంజాతో మనిషిని, జంతువుని చంపేయగలదు. ఒక్కసారి దాడి చేసిందంటే.. శరీరంలో ఒక్క ఎముకైనా విరగడం ఖాయం.

పులి పిల్లలకు పుట్టగానే కళ్లు కనిపించవు. పెరిగే క్రమంలో చూపు వస్తుంది. అప్పటి వరకు వాసన ద్వారానే అన్నింటినీ గుర్తుపడతాయి. కొన్ని పిల్ల పులులు అంధత్వంతో ఎటూ వెళ్లలేక, ఆకలికి అలమటించి చనిపోతుంటాయి.

పులుల లాలాజలంలో యాంటీసెప్టిక్‌ గుణం ఉంటుంది. దీంతో ఏవైనా గాయాలైనప్పుడు వాటిని నాలుకతో తాకడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా తప్పించుకుంటుంది.

పులుల జీవిత కాలం 25 ఏళ్లు. కానీ, ఎక్కువ శాతం పులులు 20ఏళ్లకు మించి బతకవు. ఇవి గుంపులుగా వేటాడటానికే ఇష్టపడతాయి. గంటకు 60కి.మీ వేగంతో పరిగెత్తగలవు. 

ఇంధనాల పొదుపునకు ఈ చిట్కాలు ప్రయత్నించండి..

తెలివిలోనూ రకాలు ఉంటాయి! అవేంటంటే..

మెదడుకు పదును పెట్టేద్దామిలా

Eenadu.net Home