నవ్వించేందుకు సిద్ధమైన యానిమల్‌ బ్యూటీ

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ వంగా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘యానిమల్‌’. ఇందులో జోయగా నటించి కుర్రాళ్ల మనసు దోచేసింది త్రిప్తి డిమ్రీ.

ఇప్పుడు ‘బ్యాడ్‌ న్యూజ్‌’ అంటూ ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధమైంది. ఆనంద్‌ తివారీ దర్శకత్వం వహించగా.. విక్కీ కౌశల్‌, అమీ విర్క్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 

జులై 19న విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. చూస్తుంటే ముక్కోణపు ప్రేమకథగా అనిపిస్తోంది.

యానిమల్‌ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’, ‘భూల్‌ భూలయా 3’లో నటిస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని గర్హవాల్‌ ప్రాంతంలో పుట్టిన ఈ భామ.. దిల్లీలోని శ్రీ అరబిందో కాలేజ్‌లో సైకాలజీ నుంచి డిగ్రీ అందుకుంది. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకుంది. 

యానిమల్‌ కంటే ముందు.. ‘పోస్టర్‌ బాయ్స్‌’, ‘లైలా మజ్ను’, ‘బుల్‌బుల్‌’, ‘కాలా’ చిత్రాల్లో నటించింది. నటనతో ఆకట్టుకున్నా.. అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. 

ఎప్పుడైతే ‘యానిమల్‌’లో జోయగా కనిపించిందో.. అప్పటి నుంచి ఆమెకు విపరీతంగా క్రేజ్‌ పెరిగింది. సోషల్‌మీడియాలోనూ ఫాలోవర్స్‌ పెరిగారు.

త్రిప్తి.. సంతూర్‌ మామ్‌ అని తెలుసా? అదేనండీ.. సంతూర్‌ సోప్‌ ‘మామ్‌’ యాడ్స్‌ చాలా వచ్చాయి కదా..! అందులో ఒక యాడ్‌లో ఈమె నటించింది.

పాత్రల ఎంపిక గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నటిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంటుంది. అప్పుడే నటనలో మరింత మెరుగవుతాం’అని అంది. 

టాలీవుడ్‌లో జూ.ఎన్టీఆర్‌తో నటించాలని ఉందంటూ తన కోరికను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఛాన్స్‌ వస్తే కచ్చితంగా ఆయనతో నటిస్తానంటోంది. 

This browser does not support the video element.

ఈ ‘యానిమల్‌’ అందానికి విహారయాత్రలు చేయడమంటే మహా సరదా.. గోవా, కశ్మీర్‌, మేఘాలయా, స్విట్జర్లాండ్‌ తదితర టూరిస్ట్‌ స్పాట్స్‌ను చుట్టేసింది.

This browser does not support the video element.

బాలీవుడ్‌లో తన ఫేవరెట్‌ చిత్రం ‘కభీ హా.. కభీ నా’. హీరోల్లో రణ్‌బీర్‌ కపూర్‌, క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ తన ఫేవరెట్‌. అనురాగ్‌ బసు దర్శకత్వంలో నటించాలనుందట. 

‘కష్టపడి పనిచేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు దానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది’అని త్రిప్తి చెబుతోంది. ఈ మాట ఆమె జీవితంలోనే నిజమైంది కదా..!

Images: Instagram/Triptii Dimri

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home