తాతయ్యను ఓడిస్తా.. నేనూ ట్రంప్‌నే కదా!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మనవరాలు కై మాడిసన్‌ గురించే ఇప్పుడు సోషల్‌ మీడియా మాట్లాడుకుంటోంది. 

బుధవారం జరిగిన ఓ మీటింగ్‌లో మొదటిసారిగా స్టేజీపైకి వచ్చి తాతకు మద్దతుగా ఇచ్చిన స్పీచ్‌తో వార్తల్లో హైలైట్‌గా మారింది.

ట్రంప్‌నకు పది మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వారందరిలోకి కై పెద్దది. కై పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కుమార్తె.

‘మేం మీకు తోడుగా ఉంటాం.. పోరాటం ఆపకండి..’ అంటూ ఇన్‌స్టాలో తాతకు మద్దతుగా పోస్టులు పెడుతూ ఉంటుంది.

This browser does not support the video element.

కై మాడిసన్‌ వయసు 17 ఏళ్లు. చిన్నప్పట్నుంచి గోల్ఫ్‌ ఆడటమంటే ఇష్టం. 

‘తాతయ్య నాతో కలసి గోల్ఫ్‌ ఆడేటప్పుడు నన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తారు. కానీ గెలిచి.. నేనూ ట్రంప్‌నేనని ఆయనకి గుర్తు చేస్తూ ఉంటాను..’ అని చెప్పింది.

This browser does not support the video element.

శరీరాన్ని దృఢంగా, ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంది. 

పెంపుడు జంతువులంటే ఇష్టం.. ఇంట్లో రెండు పెంపుడు శునకాలు ఉన్నాయి.

This browser does not support the video element.

స్విమ్మింగ్‌ చేయడం అలవాటు. స్కూబా డైవింగ్‌ చేస్తుంది. అంతే కాకుండా ఐస్‌ స్కీయింగ్‌ చేయడమంటే సరదా.

ట్రంప్‌ గోల్ఫర్‌ అనే పేరుతో కై యూట్యూబ్‌ ఛానల్‌ను నడుపుతోంది. ఇన్‌స్టాలో ఈమెను 2.34 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home