బాలీవుడ్‌ స్టార్స్‌కి ఉన్నంత క్రేజ్‌ ఈమెది!

బాలీవుడ్‌ సినిమా స్టార్స్‌కి ఉన్నంత క్రేజ్‌... హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తేజస్వీ ప్రకాశ్‌ సొంతం. ఇంతకీ ఈమె ఎవరంటారా? 

Image: Instagram/Tejasswi Prakash

తేజస్వీ.. హిందీ సీరియల్‌ నటి. పలు సీరియళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తూ.. బుల్లితెర స్టార్‌గా ఎదిగింది. ఈమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

Image: Instagram/Tejasswi Prakash

తరచూ తేజస్వీకి సంబంధించిన వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంటాయి. సోషల్‌మీడియాలోనూ ఈమె గురించి చర్చ జరుగుతుంటుంది.

Image: Instagram/Tejasswi Prakash

ఇన్‌స్టాలో తేజస్వీని 6.8 మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు. తను పెట్టే పోస్టులకు లైకుల వర్షం కురిపిస్తుంటారు. 

Image: Instagram/Tejasswi Prakash

బీటౌన్‌లో జరిగే సెలబ్రిటీ ఈవెంట్స్‌లో తనదైన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో హాజరై.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది.

Image: Instagram/Tejasswi Prakash

ఈ భామ సౌదీ అరేబియాలోని జెడ్డాలో 1993 జూన్‌ 10న మరాఠీ కుటుంబంలో జన్మించింది. ఆ తర్వాత ముంబయికి వచ్చి ఇక్కడే ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. 

Image: Instagram/Tejasswi Prakash

నటనపై ఆసక్తితో ప్రయత్నాలు చేయగా.. 2012లో ‘2612’ అనే థ్రిల్లర్‌ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది.

Image: Instagram/Tejasswi Prakash

ఆ తర్వాత ‘సంస్కార్‌...’, ‘స్వరాజినీ’, ‘రిష్తా లిఖింగే హమ్‌ నయా’.. తదితర సీరియల్స్‌లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది. 

Image: Instagram/Tejasswi Prakash

దాదాపు ఎనిమిదేళ్లు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ‘ఖత్రోంకీ కిలాడీ’, ‘జీ కామెడీ షో’, ‘బిగ్‌ బాస్‌’ వంటి రియాల్టీ షోల్లో పాల్గొంది. 

Image: Instagram/Tejasswi Prakash

బిగ్‌బాస్‌ సీజన్‌ 15లో పాల్గొని విజేతగా నిలిచింది. గతేడాది కంగనా రనౌత్‌ నిర్వహించిన ‘లాక్‌ అప్‌’షోలోనూ పాల్గొంది. 

Image: Instagram/Tejasswi Prakash

ఇవే కాదు.. పలు వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ మెరిసింది. పలు టీవీ సీరియల్స్‌, కార్యక్రమాల్లో అతిథిగా కనిపించి ఆకట్టుకుంది.

Image: Instagram/Tejasswi Prakash

బాలీవుడ్‌ చిత్రాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు గానీ, మరాఠీ సినిమాల నుంచి తేజస్వీకి పిలుపొచ్చింది. దీంతో 2022లో ‘మన్‌ కస్తూరి రె’లో నటించింది.

Image: Instagram/Tejasswi Prakash 

ప్రస్తుతం ‘నాగిన్‌ 6’లో నటిస్తూనే మరో మరాఠీ చిత్రం ‘స్కూల్‌ కాలేజీ అని లైఫ్‌’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

Image: Instagram/Tejasswi Prakash

హిందీ చిత్రాలకంటే.. తనకు మరాఠీలో నటించడమే ఇష్టమని.. తన కుటుంబసభ్యులు కూడా మరాఠీలోనే నటించమని చెప్పారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

Image: Instagram/Tejasswi Prakash

నటుడు, వ్యాఖ్యాత కరణ్‌ కుంద్రాతో తేజస్వీ డేటింగ్‌ చేస్తోంది. ‘బిగ్‌బాస్‌ 15’లో తేజస్వీతోపాటు కరణ్‌ కూడా పాల్గొన్నాడు. ఆ పరిచయయే వీరిద్దరనీ కలిపింది.

Image: Instagram/Tejasswi Prakash

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home