‘ఉగ్రం’లో సౌందర్యం!

ఆది సాయికుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘క్రేజీ ఫెలో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి మిర్నా. 

Image: Instagram/Mirnaa

తాజాగా అల్లరి నరేశ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోన్న ‘ఉగ్రం’లో అతడికి జోడీగా కనిపించనుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలు ఆకట్టుకుంటున్నాయి.

Image: Instagram/Mirnaa

మిర్నా కూడా మలయాళీ హీరోయినే. కేరళలోని ఇడుక్కిలో జన్మించింది. చెన్నైలో బీటెక్‌ పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేసింది.

Image: Instagram/Mirnaa

చిన్నతనం నుంచి మిర్నాకి హీరోయిన్‌ అవ్వాలనే కోరిక ఉండేదట. దీంతో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాని కెరీర్‌గా ఎంచుకుంది. 

Image: Instagram/Mirnaa

కేరళ అమ్మాయే అయినా.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘పట్టతారి’తో అదితి మేనన్‌ పేరుతో వెండితెరకు పరిచయమైంది. అదే పేరుతో ‘కలవని మాప్పిల్లై’లో నటించింది. 

Image: Instagram/Mirnaa

తన మాతృభాషలో తొలిసారిగా మోహన్‌లాల్‌‘బిగ్‌ బ్రదర్‌’లో నటించింది. ఈమె నటన ఆకట్టుకోవడంతో టాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చాయి. 

Image: Instagram/Mirnaa

‘క్రేజీ ఫెలో’లో నటిస్తున్నప్పుడే అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’లోనూ ఆఫర్‌ వచ్చింది. తెలుగులో తొలిసినిమా ఇప్పటికే విడుదలవగా.. ‘ఉగ్రం’ విడుదలకు సిద్ధమవుతోంది. 

Image: Instagram/Mirnaa

టాలీవుడ్‌లో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఓ సందర్భంలో చెప్పింది. తెలుగులో తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెబుతుందట. 

Image: Instagram/Mirnaa

టాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లు, సంగీత దర్శకులు తనకు స్నేహితులేనట. వారంతా తనతో తెలుగులోనే మాట్లాడతారని, త్వరలో పూర్తిగా తెలుగు నేర్చుకుంటానని తెలిపింది.

Image: Instagram/Mirnaa

‘అనంతం’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించిన మిర్నా చేతిలో మరో రెండు సినిమా ప్రాజెక్టులున్నాయి.

Image: Instagram/Mirnaa

తను ఏ ఒక్క భాషకు పరిమితం కాకుండా.. అవకాశాలు వస్తే ఏ భాషలోనైనా నటిస్తానని అంటోంది మిర్నా.

Image: Instagram/Mirnaa 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home