11 ఏళ్లయినా అదే జోరు..

‘శుద్ద్‌ దేశీ రొమాన్స్‌’తో బాలీవుడ్‌లో 2013లో ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్‌ ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీ బిజీగా ఉంది.

నవ్‌జ్యోత్‌ గులాటీ దర్శకత్వం వహిస్తున్న ‘బడ్తమీజ్‌ గిల్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది వాణి.

నవ్వుతూ నవ్విస్తూ వినోదాన్ని పంచే పాత్రలో ఈ బ్యూటీ కనిపించనుంది. షూటింగ్‌ ఇప్పటికే పూర్తికాగా.. నవంబరు 29న ‘బడ్తమీజ్‌ గిల్‌’ విడుదల కానుంది.

ఇది కాకుండా అక్షయ్‌ కుమార్‌కు జోడీగా ‘ఖేల్‌ ఖేల్‌ మే’లోనూ సందడి చేయనుంది. అజయ్‌ దేవగణ్‌ సరసన ‘రైడ్‌ 2’లోనూ నటిస్తోంది.

వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపైనా రాణించేందుకు ఆసక్తి చూపిస్తోంది వాణి. ‘మండల మర్డర్స్‌’ అనే టెలివిజన్‌ షోలోనూ కనిపించనుంది. 

This browser does not support the video element.

సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాలో ఈ బ్యూటీ పెట్టే పోస్టులకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తాయి.

క్యూట్‌ క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను హీటెక్కిస్తుంటుంది. ఇన్‌స్టాలో 79 లక్షలకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

వయసును తగ్గించుకుంటూ, యవ్వనంగా, ఫిట్‌గా ఉండేందుకు కఠినమైన డైట్‌ని ఫాలో అవుతుంది. అలాగే జిమ్‌లో తెగ కష్టపడుతుంది.

వాణికి పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. శునకాలు, పిల్లులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటుంది.

‘మన పనితనం ఎంత బాగున్నా.. ఎవరూ మెచ్చుకోకపోవచ్చు. అలా అని చేసే పనిని ఆపేయలేం కదా.. ప్రతి రోజూ మనకు మనమే స్ఫూర్తిని నింపుకొంటూ ముందుకెళ్లాలి’ అంటోందీ బ్యూటీ. 

మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.

బోర్‌ కొడితే.. బైక్‌ ఎక్కేయడమే!

సిల్క్‌ చీరలో చిలక.. తాప్సీ

ఈవారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

Eenadu.net Home