లేడీ ‘క్యూట్‌’ విలన్‌.. వరలక్ష్మి!

వరలక్ష్మి శరత్‌కుమార్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. విభిన్న పాత్రల్లో విలక్షణమై నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

ప్రతినాయిక, సహాయక పాత్రలతో మెప్పిస్తోన్న వరలక్ష్మి.. ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకుంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

ఇటీవల తమిళంలో ఆమె నటించిన ‘ఛేజింగ్‌’ విడుదలై హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

వరలక్ష్మి.. సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కుమార్తె. మార్చి 5, 1985న బెంగళూరులో జన్మించింది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

చెన్నైలో డిగ్రీ చేసిన వరు.. యూనివర్సిటీ ఆఫ్‌ ఎడెన్‌బర్గ్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుకుంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

తండ్రి నట వారసత్వాన్ని అందుకొని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మి.. వెండితెరపై తనదైన ముద్ర వేస్తోంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

మొదట్లో హీరోయిన్‌గా నటించినా.. ఆ తర్వాత ప్రతినాయిక, సహాయక పాత్రల్లో దూసుకెళ్తోంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

‘సర్కార్‌’ ‘క్రాక్‌’లో లేడీ విలన్‌గా అదరగొట్టిన వరలక్ష్మి అల్లరి నరేశ్‌ ‘నాంది’లో లాయర్‌గా మెప్పించింది. తాజాగా వీరసింహారెడ్డిలో భానుమతి రెడ్డిగా హిట్‌కొట్టింది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

సినిమా అవకాశాలు రాకపోతే.. డ్యాన్సర్‌గా స్థిరపడాలని వరలక్ష్మి అనుకుందట.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గొంతు బాలేదని చాలామంది విమర్శించారట. కానీ, ఇప్పుడు అదే నాకు ప్లస్‌ అయిందంటోంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

మొదట్లో బొద్దుగా ఉండే వరలక్ష్మి.. ఇటీవల సన్నబడి షాక్‌ ఇచ్చింది. నాజుగ్గా తయారై హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోను అన్నట్లుగా మారిపోయింది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

కష్టపడితే ఎలాంటి మార్పులు సాధించవచ్చో చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ అంటూ తను స్లిమ్‌గా మారిన ఫొటోను పోస్ట్‌ చేసింది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

ప్రతినాయికగా దూసుకుపోతున్న వరలక్ష్మికి కామెడీ పాత్రలో నటించాలని ఉందట.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

వరలక్ష్మికి ఇష్టమైన హీరో ప్రభాస్‌. ఆయనతో కలిసి నటించాలని ఉందంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ‘సేవ్‌ శక్తి’ పేరుతో ఓ సంస్థను స్థాపించింది వరు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ పేరుతో బేకింగ్‌ వ్యాపారమూ చేస్తోంది.

Image: Twitter/Varalakshmi Sarath Kumar

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home