‘జయమ్మ’తో అంత ఈజీ కాదు

‘పందెం కోడి 2’తో లేడీ విలన్‌ అవతారమెత్తింది వరలక్ష్మీ శరత్ కుమార్‌. ‘క్రాక్‌’లో నటనతో ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. ప్రతి నాయకుడ్ని డామినేట్ చేసే విధంగా డైలాగులు చెప్పింది. 

This browser does not support the video element.

తేజ సజ్జ ప్రధాన పాత్రలో రానున్న ‘హనుమాన్‌’లో వరలక్ష్మి హీరోకి సోదరిగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌లో ఈమె గూండాలను చితక్కొడుతూ కనిపించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ‘పాంబన్‌’, ‘పిరంతల్‌ పరాశక్తి’, తెలుగులో ‘శబరి’, కన్నడ, మలయాళ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది.

‘పందెంకోడి 2’లో వరలక్ష్మి నటనకు మెచ్చి దర్శకుడు నాగేశ్వర రెడ్డి టాలీవుడ్‌లో ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’లో అవకాశం ఇచ్చారు.

‘‘మొదట్లో నా గొంతు మూలంగా ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను డబ్బింగ్‌ చెబుతానంటే ‘ఈ గొంతుని ఎవరు వింటారు. అచ్చం మగవాళ్లు మాట్లాడుతున్నట్టుగానే ఉంది’ అన్నారు’’ అని ఓ సందర్భంలో తెలిపింది వరలక్ష్మి.

‘ఓ సినిమాలో నా పాత్రకి వేరెవరితోనో డబ్బింగ్‌ చెప్పిస్తానంటే.. లేదు.. అలా అయితే నేనీ పాత్ర చేయనని చెప్పాను. దాంతో చిత్ర బృందం ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత నేను చెప్పిన డైలాగులు వినీ అందరూ మెచ్చుకున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.

This browser does not support the video element.

ఈ భామకి బండి నడపడమంటే ఎంతో ఇష్టం. డ్రైవింగ్‌ నేర్చుకోవడం కోసం స్టెప్‌ 1 సైకిల్‌ నుంచీ కసరత్తు మొదలుపెట్టి వారం రోజుల్లో సాధించేసింది.

 ధోనీకి ఈమె వీరాభిమాని. మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో స్టేడియంలో సందడి చేస్తూ ఉంటుంది.

This browser does not support the video element.

వరలక్ష్మికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఇన్‌స్టాలో వాటి వీడియోలు, ఫొటోలను ఎక్కువగా పంచుకుంటుంది. జంతువుల పుట్టినరోజులు కూడా ఘనంగా చేస్తుంది.

This browser does not support the video element.

చిత్ర బృందంతో, స్నేహితులతో రీల్స్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. విహార యాత్రలకు వెళితే ఎక్కువగా బీచ్‌లు ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికే ఇష్టపడుతుంది. 

ఇషా చావ్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌..

జాణవులే నెర ‘జాన్వి’విలే

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

Eenadu.net Home