‘బీబీ జోడీ’లో వాసంతి జోరు!
బిగ్‌బాస్-6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న వాసంతి కృష్ణన్ ‘బీబీ జోడీ’లో అదరగొడుతోంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారితో నిర్వహిస్తోన్న డ్యాన్స్ షో ఇది.
Image: Instagram/vasanthi Krishnan
ట్రెండీ దుస్తుల్లో స్టెప్పులేస్తూ షో న్యాయనిర్ణేతలతోపాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
Image: Instagram/vasanthi Krishnan
ఇటీవల ఈమె నటించిన ‘గేమ్ ఆన్’ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి యూత్‌ను ఆకర్షించింది.
Image: Instagram/vasanthi Krishnan
తిరుపతిలో 1997 మే 25న జన్మించిన వాసంతి.. బెంగళూరులో ఏవియేషన్ ఇంజినీరింగ్ చదువుకుంది.
Image: Instagram/vasanthi Krishnan
ఫ్యాషన్, సినీరంగంపై ఆసక్తితో చదువు మధ్యలోనే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. కన్నడలో పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
Image: Instagram/vasanthi Krishnan
దీంతో తెలుగులో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘సిరి సిరి మువ్వలు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. గుప్పెడంత మనసు, గోరింటాకు తదితర సీరియల్స్‌లోనూ నటించింది.
Image: Instagram/vasanthi Krishnan
సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘క్యాలీఫ్లవర్’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారింది. ‘వాంటెడ్ పండుగాడ్’లోనూ మెరిసింది.
Image: Instagram/vasanthi Krishnan
బిగ్‌బాస్-6లో కంటెస్టెంట్‌గా వెళ్లి ప్రేక్షకులకు మరింత చేరువైన వాసంతి.. అనూహ్యంగా ఎలిమినేటైంది. తోటి కంటెస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్తల్లోనూ నిలిచింది.
Image: Instagram/vasanthi Krishnan
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాసంతి.. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అనే సీరియల్‌లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది.
Image: Instagram/vasanthi Krishnan
అబ్బాయిలు నిజాయితీగా ఉంటే తనకు నచ్చుతారట. అలాంటి అబ్బాయే తన డ్రీమ్‌బాయ్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Image: Instagram/vasanthi Krishnan