బీచ్‌.. బాక్సింగ్‌.. బీట్‌.. ఇదే వేదిక రూట్‌

వివిధ భాషల్లో, వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉంది వేదిక. ప్రస్తుతం తమిళంలో ‘పెటారాప్‌’తో రానుంది. 

‘పెటారాప్‌’ సెప్టెంబరు 27న విడుదల కానుంది. ప్రభుదేవాకు జంటగా నటిస్తోంది వేదిక. ఇందులో మరో నాయిక సన్నీలియోని.

తెలుగులో ‘ఫియర్‌’ అనే థ్రిల్లింగ్‌ మూవీతో భయపెట్టేందుకు సిద్ధమైంది. ఆ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. 

ఈమెకి మూగజీవాలంటే ఇష్టం. జంతు వధకి వ్యతిరేకంగా పోరాడుతోంది. జంతువుల గురించి సోషల్‌ మీడియాలో తన గళం వినిపిస్తుంటుంది.

ట్రెండీ లుక్స్‌తో ఇన్‌స్టాలో సందడి చేస్తోంది. ఇన్‌స్టాలో 41 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

డ్యాన్స్‌ అంటే మహా ఇష్టం. నిరంతరం ప్రాక్టీసు చేస్తూనే ఉంటుంది. ఫిట్‌గా ఉండేందుకు ఇదీ ఒక కారణమేనని చెబుతోంది. 

 బీచ్‌లో ఆడుకోవడం నచ్చుతుంది. అక్కడ దిగిన ఫొటోలను ‘ట్రావెల్ డైరీస్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటుంది.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తనకి ఇష్టదైవం. తరచూ అక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది.

కిక్‌ బాక్సింగ్‌ను ప్రాక్టీసు చేయడం హాబీ. జిమ్‌లో కాస్త సమయాన్ని దీనికీ కేటాయిస్తుంది.

ప్రస్తుతం మలయాళంలో ‘నాలామ్‌ తూను’, ‘చెతి మందారం తులసి’, కన్నడలో ‘గన’, తమిళంలో ‘వినోదన్‌’, ‘జంగిల్‌’ వంటి చిత్రాల్లో బిజీగా ఉంది. 

ఇటీవల ‘యక్షిణి’ అనే హారర్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ద్వారా ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘రజాకర్‌’లోనూ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో అలరించింది. 

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home